Bigg Boss 9 Thanuja: తనూజ తీరుపై.. నెట్టింట ఫన్నీ.. క్రేజీ ట్రోల్
బిగ్ బాస్ తెలుగు 9లో తన ఆటతో, మాటతో తనూజ పుట్టస్వామి తెలుగింటి ఆడబిడ్డగా మారింది. అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పొందినా, షో తర్వాత సోషల్ మీడియాలో సైలెంట్ అయింది. తనూజ అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఆమె దృష్టిని ఆకర్షించేందుకు ఫన్నీ ట్రోల్స్‌తో పోస్టులు పెడుతున్నారు. తనూజ ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలియక ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో తెలుగింటి ఆడబిడ్డగా మారిపోయింది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. అంతకుముందు తెలుగులో పలు సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ బిగ్‌బాస్‌తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుందీ అందాల తార. కన్నడ నాటకు చెందిన తనూజ మొదట అందాల రాక్షసి సీరియల్ లో నటించింది. ఆ తర్వాత ముద్ద మందారం సీరియల్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సీరియల్స్, షోలలో నటించిన తనూజ అనూహ్యంగా గతేడాది తెలుగు బిగ్‌బాస్ 9లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. గేమ్స్, టాస్క్‌లు, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ తన సత్తా చాటింది. ఓటింగ్‌లో ఎవ్వరూ అందుకోని విధంగా టాప్‌లోకి దూసుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం ఓటింగ్ లో టాప్ లో నిలిచిన తనూజనే టైటిల్ కూడా గెలుస్తుందనుకున్నారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య బిగ్‌బాస్ షో తెలుగు 9 టైటిల్ ను కల్యాణ్ పడాల ఎగరేసుకుపోయాడు. అయినా ఏ మాత్రం నిరాశ చెందని తనూజ.. తన బిహేవియర్ తో తానే నిజమైన విన్నర్‌నని నిరూపించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా బయట కనిపించడం ఈమె.. ఆమధ్యన ఓ టీవీ ప్రోగ్రామ్ లో తళుక్కుమంది. చివరకు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిపోయింది. గతంలో సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉందేది తనూజ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలన్నింటినీ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకునేది. అయితే ఇప్పుడు అలా ఉండడం లేదీమె. కేవలం అప్పుడప్పుడు మాత్రమే పోస్టులు పెడుతోంది. ఒకసారి తనూజ ఇన్ స్టా గ్రామ్ ఖాతాను పరిశీలిస్తే.. ఆమె జనవరి 09న ఒక పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తనూజ తమను పట్టించుకోవడం లేదంటూ అభిమానులు, నెటిజన్లు మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాలంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. పోకిరి సినిమాలో మహేష్, ఇలియానాల ల మధ్య జరిగే సరదా సంభాషణను ఉపయోగించి ఈ బిగ్ బాస్ బ్యూటీని ట్రోల్ చేస్తన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్
Top 9 ET: రాజాసాబ్ నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్ | 400 కోట్ల వైపు దూసుకుపోతున్న చిరు సినిమా
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
Allu Arjun: సందీప్ ఓకే.. మరి ఆ స్టార్ డైరెక్టర్ల మాటేంటి బన్నీ
Anil Ravipudi: మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు
