Bigg Boss Telugu 9: తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక

Updated on: Dec 06, 2025 | 4:18 PM

బిగ్ బాస్ విజేత రేసులో ఉన్న తనుజపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడులను 'ముద్ద మందారం' నటుడు పవన్ సాయి తీవ్రంగా ఖండించారు. అభిమానుల యుద్ధం పేరుతో అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తనుజకు తన పూర్తి మద్దతు ఉంటుందని, గెలిపించేందుకు కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ విమర్శల హద్దులు దాటొద్దని పవన్ సాయి కోరారు.

బిగ్ బాస్ సీజన్ నడిచిన ప్రతిసారీ ఈ ఫ్యాన్స్ వార్ చాలా కామన్. ఈ సీజన్‌లో విన్నర్ రేస్‌లో ముందున్న తనూజ ని సపోర్ట్ చేసేవాళ్లు ఎంతమందైతే ఉన్నారో.. ఆమెను ద్వేషించుకునే వాళ్లూ అదే స్థాయిలో ఉన్నారు. నచ్చిన వాళ్లు గెలివాలని కోరుకుంటే.. ఆమె నచ్చని వాళ్లు మాత్రం సోషల్ మీడియా వేదికగా పర్సనల్ ఎటాక్‌కి దిగుతున్నారు.తనూజపై బ్యాడ్ కామెంట్స్ చేస్తూ.. నెగిటివ్ పోస్ట్‌లు పెడుతున్న వాళ్లకి రిక్వెస్ట్ చేశారు ముద్దమందారం సీరియల్ యాక్టర్ పవన్ సాయి . ముద్దమందారం సీరియల్‌లో కలిసినటించినప్పటి నుంచి తనూజ, పవన్ సాయిల పెయిర్ బాగా పాపులర్. ఇక తనూజ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెను బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ సాయి. రీసెంట్‌గా ఫ్యామిలీ వీక్‌లో కూడా.. తనూజ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదికి వెళ్లి సపోర్ట్ చేశారు పవన్ సాయి. ఇక బయట తనూజకి సంబంధించిన పీఆర్ వర్క్ చాలా వరకూ ముద్దమందారం సీరియల్ టీం చేస్తుండగా.. ముందుండి నడిపిస్తున్నది మాత్రం ఈ సీరియల్ హీరో పవన్ సాయి. బిగ్ బాస్ మరో రెండు వారాల్లో ముగుస్తుండగా.. తనూజపై నెగిటివిటీ ఎక్కువ ప్రచారం జరుగుతుండటంతో రియాక్ట్ అయ్యారు పవన్ సాయి. మీ ఇళ్లల్లో కూడా అమ్మ, అక్క, చెల్లి ఉంటారు కదా.. దయచేసి తనూజని బూతులు తిట్టొద్దని రిక్వెస్ట్ చేశారు పవన్ సాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా

రీతూ తొండాట… సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు

సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఊరెళ్లేదెలా ??

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..