నాలుగో పెళ్లాం వచ్చిన వేళా విశేషం.. లాటరీ గెలిచిన నటుడు…

Updated on: Jul 10, 2025 | 8:43 PM

అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని విషయాలు వినడానికి గమ్మత్తుగా ఉంటాయి. అవి మనల్ని నవ్వాల్నో ఏడవాల్నో తెలీని సందిగ్దంలో పడేస్తాయి. ఇప్పుడు కోలీవుడ్ నటుడు బాల కూడా.. తన అభిమానులను అలాంటి సందిగ్దంలోనే పడేశాడు. తన లైఫ్‌లోని ఓ గుడ్ న్యూస్‌ను షేర్ చేసుకుని అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు.

అంతేకాదు ఆ న్యూస్‌తో.. మనకు పెద్దగా సంబంధం లేకపోయినా, తెలుగు మీడియాలో కూడా ఆ వార్త వైరల్ అవుతోంది. బాల! కోలీవుడ్ , మల్లూ వుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తెలుగులోనూ టూమచ్, చాప్టర్ 6 సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాల.. సినిమాతోనే గానే వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న నటుడిగా వెరీ పాపులర్‌..! ఎందుకంటే మనోడు.. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు గనుక. అంతటితే ఆగకుండా.. తాజాగా కోకిల అనే తన చుట్టాలమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకుని కోలీవుడ్‌లో వైరల్ అయ్యాడు ఈ నటుడు. ఇక ఈ సంతోషంలోనే బాల మరో న్యూస్‌ను కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసుకున్నాడు. తన భార్య వచ్చిన వేళా విశేషం వల్ల తాను లాటరీ గెలుచుకున్నానని చెప్పుకొచ్చాడు. ‘ఆ లాటరీలో గెలిచిన అమౌంట్‌ .. ఎంతో తెలుసా? 25 వేల రూపాయలు’ అని చెబుతూ వినేవారిని ఉసూరుమనేలా చేశాడు. అంతేకాదు ఈ అమౌంట్‌ను ఏదైన మంచి పని కోసం ఉపయోగిస్తానని చెబుతూ.. తన భార్య చేతిలో పెట్టాడు. అయితే.. ‘ లాటరీ గెలిచాడంటే.. కోట్లలో డబ్బు గెలిచాడేమో’ అని అనుకున్న నెటిజన్లు.. బాల మాటలు చూసి నవ్వుకుంటున్నారు. ఇదేం విచిత్రం రా అయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా.. !

‘అతను చనిపోవడమే బెటర్..’ ఉదయ్‌ చావుపై కౌషల్‌ షాకింగ్ కామెంట్స్

ఆలియాకు టోకరా వేసిన PA.. పోలీసులకు పట్టించిన హీరోయిన్

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్‌