దేవుళ్లతో కామెడీలొద్దు.. ఇచ్చిపడేస్తారు…

Updated on: Apr 20, 2025 | 6:25 PM

ఊర్వశి రౌతేలా..! హీరోయిన్‌కు ఎక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు తక్కువగా ఉండే ఈమె.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తన అందచందాల రీల్స్‌తో వైరల్ అయింది. అలా సౌత్ వరకు వచ్చి... మన స్టార్ హీరోల పక్కన ఐటెం సాంగ్స్‌ చేస్తూ.. ఇక్కడ కూడా హాట్ బ్యూటీగా నామ్ కమాయించింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. కాస్త అతిగా మాట్లాడింది.

సౌత్‌ లో తనకు గుడి కట్టాలని తన ఫ్యాన్స్‌ను కోరింది. అలా చెబుతూ.. ఉత్తరాఖండ్లో తనకో గుడిందంటూ… నోరు జారింది. ఇప్పుడు తలపట్టుకునే వరకు తెచ్చుకుంది. ఎస్! ఉత్తరాఖండ్ లో తన పేరు మీద ఓ ఆలయం ఉందని బాలీవుడ్‌లో ఓ షోలో చెప్పిన ఊర్వశి.. బద్రీనాథ్ కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న తన ఆలయాన్ని సందర్శించండి అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. అయితే ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కడి అర్చకులు సీరియస్ అయ్యారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట నిజమేనని.. కానీ ఆ గుడికి, నటికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. పురాణాల ప్రకాం సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం లేదా.. శ్రీమహావిష్ణువు తొడ భాగం కింద పడి.. ఊర్వశీ దేవి ఆలయంగా మారిందని అంటారని.. కానీ ఊర్వశీ పేరుతో ఉన్న ఆలయం తనదే అని ఊర్వశీ రౌరౌతేలా.. అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక అర్చకుడు భువన్ చంద్ర ఉనియాల్ మండిపడ్డారు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా 108 శక్తిపీఠాల్లో ఒక్కటిగా ఇక్కడి ప్రజలు దేవతగా కొలుస్తారని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: హీరోలకు లేని నొప్పి.. ఫ్యాన్స్‌కు ఎందుకు | అల్లు అర్జున్‌కు హ్యాండిచ్చిన స్టార్ హీరోయిన్

చరిత్ర సృష్టించిన ట్రాఫిక్ జాం.. 12 రోజులు రోడ్లపై నరకం చూసిన జనం..

దొంగలకు కూడా లక్షల్లో వేతనం.. వారు చేసే పని తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు.. ఏం జరిగిందంటే..

వామ్మో ..! నీళ్ల బాటిల్‌ ధర రూ. 50 లక్షలా?