రాజమౌళితో మాస్ మహరాజ్ తలపడటం లేదా

Edited By: Phani CH

Updated on: Oct 28, 2025 | 6:38 PM

రాజమౌళి సినిమాతో రవితేజ తలపడుతారా? అయినా వాళ్లిద్దరి మధ్య పోటీని జనాలు కాదు కదా.. వాళ్లైనా ఊహిస్తారా? ఆ మధ్య కొంత కాలం నుంచీ జరుగుతున్న డిస్కషన్‌ ఇది. జక్కన్న - రవితేజ మధ్య ఉన్న బాండింగ్‌ తెలిసిన వాళ్లు మాత్రం... అది జరగదు అని గట్టిగానే చెరప్పారు. ఇప్పుడు వాళ్ల నమ్మకమే నిజం కానుందా? ఏది ఏమైనా అక్టోబర్‌ 31కే వచ్చేస్తున్నామని చెప్పారు మాస్‌ మహరాజ్‌ రవితేజ.

మరి ఆ మాటని నిజం చేయకపోతే ఎలా? అలాగని ఆ రోజు బాహుబలిని ఎదుర్కొని ఓపెనింగ్స్ ని డివైడ్‌ చేసుకోవడం మాత్రం లాభమా ఏంటి? అందుకే సమన్యాయం జరిగేలా డిసైడ్‌ అయినట్టున్నారు మేకర్స్ మాస్ జాతర ప్రీమియర్స్ ని ఈ నెల 31న ప్లాన్‌ చేస్తున్నారు. సినిమాను పూర్తి స్థాయిలో నవంబర్‌ ఒకటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. మాస్‌ జాతర పక్కా కమర్షియల్‌ హిట్‌ అవుతుందనే హోప్స్ టీమ్‌లో మెండుగా ఉన్నాయి.బాహుబలి రెండు పార్టులను కలిపి బాహుబలి ది ఎపిక్‌ పేరుతో ఈ నెల 31న రిలీజ్‌ చేస్తున్నారు. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ మూవీకి ఆడియన్స్ లో క్రేజ్‌ కూడా అమితంగా ఉంది. అందుకే మాస్‌ జాతర మేకర్స్ ఒక్కడుగు వెనక్కి వేశారన్నది టాక్‌. దీంతో బాహుబలి ది ఎపిక్‌కి హ్యూజ్‌ ఓపెనింగ్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే

పశువులకోసం గడ్డి కోస్తున్న యువతి.. ఊహించని విధంగా

పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం

చింపాంజీ గెటప్‌లో మున్సిపల్ సిబ్బంది.. జనగామలో వింత ప్రయోగం

Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా