AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ఇంకొన్ని రోజులు ఇలా.. మరణ శిక్ష వేసినా ఓకే'

‘ఇంకొన్ని రోజులు ఇలా.. మరణ శిక్ష వేసినా ఓకే’

Phani CH
|

Updated on: Oct 28, 2025 | 6:43 PM

Share

శాండల్‌వుడ్ హీరో దర్శన్‌ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో రెండోసారి అరెస్టైన దర్శన్‌ ప్రస్తుతం జైలులోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చాలాసార్లు విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని వేడుకున్నారు. కానీ దర్శన్ అడిగిన సౌకర్యాలు ఇవ్వడం సాధ్యం కాదని.. అందులో కొన్ని మాత్రమే ఇవ్వగలమని కోర్టు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే పిటిషన్‌ వేయగా.. తాజాగా న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దర్శన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. జైలులో దర్శన్‌కు కనీస సదుపాయాలు కల్పించడం లేదని వివరించారు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఏ శిక్ష విధించినా దర్శన్‌ సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. త్వరగా విచారణ జరిపి.. మరణశిక్ష విధించినా సరే తమకు సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదించారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టిందని.. గతంలో తనకు విషమిస్తే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్‌ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయవాది గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసి తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే

పశువులకోసం గడ్డి కోస్తున్న యువతి.. ఊహించని విధంగా

పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం

చింపాంజీ గెటప్‌లో మున్సిపల్ సిబ్బంది.. జనగామలో వింత ప్రయోగం

Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా