38 ఏళ్లకే రిటైర్ మెంట్ ప్రకటించి షాకిచ్చిన స్టార్ సింగర్!
ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ తన 38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ సంచలన నిర్ణయంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కొత్త ప్రాజెక్టులు తీసుకోనని, అయితే సంగీతాన్ని పూర్తిగా వదిలిపెట్టనని, సొంతంగా మరిన్ని పనులు చేస్తానని తెలిపారు.
తన స్వీట్ వాయిస్‌తో వందలాది పాటలకు ప్రాణం పోసిన ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా 38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నారు.ప్రస్తుతం అర్జిత్ సింగ్ క్రేజ్ పీక్స్ లో ఉంది. బాలీవుడ్‌లో ఏ సినిమా రిలీజ్ అయినా అర్జిత్ సింగ్ సాంగ్ పాడాల్సిందే అన్న పరిస్థితి ఉన్న ఇలాంటి సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అర్జిత్ సింగ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన పోస్టులో, “ఇకపై నేను ప్లేబ్యాక్ సింగర్‌గా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం లేదని ప్రకటిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఒక చిన్న కళాకారుడిగా మరింత నేర్చుకొని, సొంతంగా మరిన్ని పనులు చేస్తానని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
