Kalki 2898 AD: కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.

|

Jun 26, 2024 | 6:12 PM

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. అటు ప్రమోషన్లతో మరింత క్యూరియాసిటిని కలిగిస్తున్నారు మేకర్స్. మన పురణాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో కల్కి మేకర్స్‌ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. అటు ప్రమోషన్లతో మరింత క్యూరియాసిటిని కలిగిస్తున్నారు మేకర్స్. మన పురణాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో కల్కి మేకర్స్‌ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్స్ రేట్స్‌ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్కి ప్రాజెక్ట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోతోపాటు మరో ఎనిమిది రోజులు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది.

ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి మేకర్లకు శుభవార్త అందించింది. కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 75 రూపాయాలు.. మల్టీప్లెక్స్ లో టికెట్ పై 125 రూపాయాలు పెంచేందుకు కల్కి టీం కు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే రోజుకు 5 షోలు వేసుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక టికెట్స్‌ రేట్‌ అండ్ బెన్‌ ఫిట్ షోస్‌ పై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అనుమతులివ్వడంపై కల్కి మేకర్స్‌ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.