Ante Sundaraniki Trailer Launch Event: సుందర్- లీల సంగతులు.. అంటే సుందరానికి ప్రీరిలీజ్ ఈవెంట్

Updated on: Jun 02, 2022 | 6:56 PM

నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా అంటే సుందరానికి.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ  రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోంది.