Animal: అబ్బే.! మరీ ఇంత మోసమా.. OTTలో దెబ్బేసిన యానిమల్ మూవీ.
యానిమల్ సినిమా... థియేటర్లలో విధ్వంసం అంటే ఏంటో చూపించింది. అంతకు మించి అందరి నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. దానికి మించి కలెక్షన్లను కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసుకుంది. ఆ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ తర్వాత.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు ముందు... ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటే.. యానిమల్ ఫ్యాన్స్‌లో తెలియని ఈగర్‌ను పెంచింది. ఈ మూవీని ఓటీటీలో మరో సారి చూడాల్సిందే అని తీర్మానించుకునేలా చేసింది.
యానిమల్ సినిమా… థియేటర్లలో విధ్వంసం అంటే ఏంటో చూపించింది. అంతకు మించి అందరి నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. దానికి మించి కలెక్షన్లను కుప్పలు తెప్పలుగా వచ్చేలా చేసుకుంది. ఆ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ తర్వాత.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు ముందు… ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటే.. యానిమల్ ఫ్యాన్స్‌లో తెలియని ఈగర్‌ను పెంచింది. ఈ మూవీని ఓటీటీలో మరో సారి చూడాల్సిందే అని తీర్మానించుకునేలా చేసింది. కానీ కట్ చేస్తే.. తాజాగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న యానిమల్ సినిమా.. సందీప్ మాటలకు దూరంగా ఉండడం.. ఇప్పుడు వారందర్నీ బాధిస్తోంది. అబ్బే మరి ఇంత మోసమా అని నెట్టింట కామెంట్ చేసేలా చేస్తోంది. ఓటీటీలో యానిమల్ దెబ్బేసింది మామా.. అని దిగాలు పడేలా చేస్తోంది. అయితే ఇంతకీ అంతలా ఏం జరిగింది?
అసలు విషయం ఏంటంటే..! ఈ సినిమా ఓటీటీ వెర్షన్ ను కాస్త పొడగించి విడుదల చేస్తామని గతంలో సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దాదాపు 8 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తామని కాస్త గట్టిగానే..అందరికి రీచ్ అయ్యేలానే చెప్పారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్ పై అందర్లో చెప్పలేనంత క్యూరియాసిటీ పెరిగింది. కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న సినిమా మొత్తం థియేట్రికల్ వెర్షన్ లో ఉంది. ఎక్ట్స్రా సీన్స్ లేవు. దీంతో చాలా మంది నెటిజన్స్.. డిస్సపాయింట్ అవుతున్నారు. ఓటీటీ వెర్షన్లో అన్ సీన్ ఫుటేజ్ చూపిస్తారని భావించిన వాళ్లు.. తెగ ఫీలవుతున్నారు. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే… థియేట్రికల్ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు ఉండగా.. ఓటీటీలో 3 గంటల 24 నిమిషాలు ఉంది. కేవలం మూడు సీన్స్ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా పట్టి పట్టి చూస్తే..! దీంతో యానిమల్ ఫ్యాన్స్… ఈ విషయంగా నెట్టింట వైల్డ్ అవుతున్నారు. క్రేజీ.. ఫన్నీ.. సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos