Andhra King Taluka: OTTలోకి స్ట్రీమింగ్‌కు రాపో సినిమా.. డేట్ ఫిక్స్

Updated on: Dec 18, 2025 | 1:15 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మిక్స్‌డ్ టాక్ వచ్చినా డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 25 నుండి ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని సమాచారం. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, రామ్ ఫ్యాన్స్ ఈ ఓటీటీ విడుదల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని ఆశిస్తున్నారు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఎ బయోపిక్ అఫ్ ఏ ఫ్యాన్ అంటూ వచ్చిన ఈ సినిమాను మహేష్ బాబు తెరకెక్కించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. డీసెంట్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈక్రమంలోనే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా డిసెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇక ఈ మూవీ కథలోకి వెళితే.. ఆంధ్రా కింగ్ తాలూకా కథ గోదావరి జిల్లాలో 2002 ప్రాంతంలో మొదలవుతుంది. ఆంధ్ర కింగ్ సూర్య అలియాస్ ఉపేంద్ర తెలుగు రాష్ట్రాల్లో దేవుడు లాంటి హీరో. చాలా పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకుడు. అలాంటి హీరో 100వ సినిమాకు రెడీ అవుతున్న తరుణంలో అనుకోకుండా అది ఆగిపోతుంది. ఆర్థిక సమస్యల కారణంగా 100 సినిమా ఆగిపోవడంతో సూర్య బాగా కృంగిపోతాడు. మరోవైపు అదే గోదావరి జిల్లాలో సూర్యకు అతిపెద్ద అభిమాని సాగర్ అలియాస్ రామ్ పోతినేని. అదే ఊర్లో ఉన్న మహాలక్ష్మి థియేటర్ ఓనర్ పురుషోత్తం అలియాస్ మురళీ శర్మ కూతురు మహాలక్ష్మి అలియాస్ భాగ్యశ్రీ ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు సాగర్. కానీ వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి పురుషోత్తంతో ఒక ఛాలెంజ్ చేస్తాడు సాగర్. అది హీరో సూర్య కెరీర్ కు ముడిపడి ఉంటుంది. అది ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. తన స్టార్డంని సైతం పక్కన పెట్టి ఒక అభిమానిగా చాలా బాగా నటించాడు. కానీ, బ్యాడ్ లక్.. ఈ సినిమా కూడా రామ్ కి పరాజయాన్నే మిగిల్చిందని చెప్పాలి. ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, రామ్ ఫ్యాన్స్ మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఈ సినిమా బాగున్నప్పటికీ ఎక్కువ మంది థియేటర్స్ కి వెళ్లి సినిమాను చూడలేదు. కానీ, ఓటీటీలో అంటే అందరు తప్పకుండా చూస్తారు. కాబట్టి, ఓటీటీ విడుదల తరువాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: మరోసారి గొంతు సవరించుకుంటున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ

Jailer 2: జైలర్ 2లో ఆ ముద్దుగుమ్మతో స్పెషల్ సాంగ్‌.. దుమ్ము దుమారమే

చిరంజీవి వల్ల కాలేదు.. పోనీ.. బాలయ్య చేశాడా? అదీ లేదు

Rakul Preet: ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన రకుల్

Rashmika Mandanna: దోస్తులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మిక.. ఫోటోలు వైరల్