‘మెడలో నక్లెస్‌ కాదు.. పెళ్లికి వడ్డానం కూడా పెట్టుకుంటా’ ట్రోలర్స్‌కు శిరీష్‌ దిమ్మతిరిగే పంచ్‌

Updated on: Nov 12, 2025 | 12:40 PM

అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుకలో నెక్లెస్ ధరించడంపై ట్రోలింగ్‌కు గురికాగా, హీరో ధీటుగా స్పందించారు. భారతీయ రాజులు, మొఘలులు చోకర్లు ధరించేవారని గుర్తుచేస్తూ, తన లుక్‌ను సమర్థించుకున్నారు. పెళ్లిలో వడ్డాణం పెడితే ఏమవుతుందో అంటూ ట్రోలర్స్‌కు ఫన్నీ పంచ్ ఇచ్చారు. శిరీష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. కొన్నాళ్లుగా నయనికతో ప్రేమలో ఉన్న శిరీష్.. ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఇద్దరి ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ తన నిశ్చితార్థ వేడుకలో శిరీష్ మెడలో నెక్లెస్ ధరించడం అంతటా హాట్ టాపిక్ అయింది. ఆయనపై ట్రోల్స్‌కు దారి తీసింది. ఈక్రమంలోనే తన లుక్‌పై వచ్చిన ట్రోల్స్‌ ను అడ్రస్ చేస్తూ.. ఇప్పుడో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు శిరీష్‌. అందులో ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చాడు. నెక్ట్స్‌ వడ్డనం పెడితే ఏమైపోతారో అంటూ ట్రోలర్స్‌ను ఆడేసుకున్నాడు. మన తెలుగు మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చిన శిరీష్‌.. చోకర్లను మన భారతీయ మహారాజులు, మొఘలులు కూడా ధరించారంటూ చెప్పాడు. పూర్వకాలంలో రాజులు అందరూ చోకర్లు పెట్టుకునేవారన్నాడు.అంతేకాదు అప్పట్లో రాజులు ధరించిన నెక్లెస్ ఫోటోలనూ కూడా షేర్ చేశాడు. నెక్లెస్ కే ఇలా అయిపోతే.. పెళ్లికి వడ్డాణం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ… మరోసారి ఫన్నీ మీమ్ తో… ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే పంచ్‌ కూడా ఇచ్చాడు ఈ స్టార్ హీరో. ఇక ప్రస్తుతం శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాను ఊహించినట్టే.. ఈ హీరో మరణించాడు..! డెస్టినీ అంటే ఇదేనేమో