Watch: అల్లు అరవింద్ తల్లి పాడె మోసిన చిరంజీవి, బన్నీ

Updated on: Aug 30, 2025 | 4:25 PM

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. శనివారం కోకాపేటలోని వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయి. చిరంజీవి, అల్లు అర్జున్ పాడెను మోశారు. అల్లు, మెగా కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) శుక్రవారం అర్థరాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. శనివారం మధ్యాహ్నం కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రంలో కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. తల్లికి అల్లు అరవింద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకరత్నమ్మ పాడెను చిరంజీవి, అల్లు అర్జున్ స్వయంగా మోశారు. అంత్యక్రియలలో అల్లు, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Published on: Aug 30, 2025 04:24 PM