Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్

Updated on: Mar 13, 2026 | 8:36 PM

ప్రస్తుతం అట్లీతో బన్నీ సినిమా తర్వాత, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'AA23' రానుంది. దీని గ్లింప్స్ రికార్డు సృష్టించగా, తాజాగా లోకేశ్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ₹75 కోట్ల రెమ్యునరేషన్, లాభాల్లో 1% వాటా ఆఫర్ చేసినట్లు వార్త లీకైంది. ఈ భారీ డీల్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది. అధికారిక ధృవీకరణ లేకున్నా, ఈ వార్త ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచుతోంది.

ఎట్ ప్రజెంట్ అట్లీ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్న బన్నీ.. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నాడు. AA 23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయేఈ సినిమా నుంచి.. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన అనౌన్స్‌ మెంట్ గ్లింప్స్‌ సెన్సేషన్‌గా మారింది. రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. AA23 సినిమా కోసం డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌కు.. మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ న్యూస్… బన్నీ సినిమా కోసం.. లోకేష్‌కు ఏకంగా 75కోట్లు రెమ్యునరేషన్‌తో పాటు.. లాభాల్లో ఒక శాతం వాటా కూడా చెల్లించనున్నారట మైత్రీ మేకర్స్. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. AA23 బ్లాక్‌బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ డీల్ గురించి మైత్రీ మూవీ మేకర్స్ వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినా.. లీక్ అయిన ఈ ఇన్ఫో మాత్రం ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్

డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా

Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌

Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా

Follow Us