టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

Updated on: Jan 15, 2026 | 2:30 PM

జపాన్ తెలుగు సినిమాకు ప్రధాన మార్కెట్ గా ఎదుగుతోంది. ట్రిపుల్ ఆర్, బాహుబలి వంటి చిత్రాలు అక్కడ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2ను జనవరి 16న జపాన్ లో విడుదల చేస్తున్నారు. సినిమా కథలో జపాన్ కు సంబంధం ఉండటంతో, ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ కుటుంబంతో అక్కడికి వెళ్లారు.

జపాన్ ప్రస్తుతం తెలుగు సినిమాకు ఓ ప్రధాన విదేశీ మార్కెట్ గా రూపాంతరం చెందుతోంది. గతంలో ఉత్తర అమెరికా మాత్రమే టాలీవుడ్ చిత్రాలకు ముఖ్యమైన ఓవర్సీస్ కేంద్రంగా ఉండేది. అయితే ఇప్పుడు జపాన్ తెలుగు సినిమాలకు రెండో ఇల్లుగా మారుతోంది. రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ చిత్రం జపాన్ లో పాతికేళ్ల రజనీకాంత్ ముత్తు రికార్డులను అధిగమించి చరిత్ర సృష్టించింది. దాదాపు 500 రోజులు ప్రదర్శితమై 136 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్ బాహుబలి కూడా జపాన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇటీవల వచ్చిన దేవర, కల్కి 2898 AD వంటి చిత్రాలకు సైతం జపాన్ లో మంచి వసూళ్లు వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం :

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?

చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ