Pushpa 2: 6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..
పుష్ప రికార్డులు కొల్లగొడుతున్నాడు. ప్రీమియర్ షోతోనే గుడ్ టాక్ తెచ్చుకున్న పుష్ప-2 వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. బాక్సాఫీసువద్ద పుష్ప రూలింగ్ కనకవర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 1,000 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. “ది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప-2’ చరిత్రను తిరగరాసింది. 6 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది”అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మొత్తంగా వరల్డ్‌వైడ్‌గా ఆరు రోజుల్లో రూ. 1002కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వసూళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆరు రోజుల్లోనే బాలీవుడ్‌లో ఈ చిత్రానికి రూ. 375 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. హిందీ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన తొలి సినిమాగా నిలిచింది. ఇక 2021లో వచ్చిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘పుష్ప-2’ మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు చెట్లు నరికేస్తున్నారు
క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ