Pushpa 2: బాధ్యతంతా బన్నీదే 7 నగరాల్లో పుష్ప 2 టీమ్ సందడి

|

Nov 12, 2024 | 9:46 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడింది. ఇప్పటికే సినిమా ఎలా ఉంటుందో అని అల్లు అభిమానగణం మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. పుష్ప 2 విడుదలకు ఇంకా 26 రోజుల సమయం ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. రోజు రోజుకు పుష్ప సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. పుష్ప 2.. రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని ఇప్పటికే ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. నవంబర్ 15న బీహార్ రాజధాని పాట్నాలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. అలాగే వివిధ నగరాలకు వెళ్లి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మేకర్స్ 6 నగరాల్లో పర్యటించబోతున్నారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ‘పుష్ప 2’ ఈవెంట్ 6 కాదు 7 నగరాల్లో జరగబోతోందని మేకర్స్ తెలిపారు. ముందుగా వెల్లడించిన ఆరు నగరాలు పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్. ఇప్పుడు కోల్‌కతా నగరాన్న కూడా యాడ్ చేశారు. పుష్ప 2 టీమ్‌తో కోల్‌కతాలో కూడా సినిమాను ప్రమోట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 ప్రమోషన్స్ బాధ్యతను అల్లు అర్జున్ తీసుకున్నారని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఆయన ఆ పనుల్లో బిజీగా ఉండటంతో పుష్ప 2 ప్రమోషన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఈమేరకు మేకర్స్, పుష్ప 2 అధికారిక Xలో ఒక పోస్ట్ షేర్ చేశారు. పోస్ట్‌లో భారతదేశంలో అతిపెద్ద చిత్రం కోసం ఈవెంట్‌లు లైనప్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ‘పుష్ప 2’ ఈవెంట్‌ల కోసం సిద్ధంగా ఉండండి. పాట్నా నుంచి ట్రైలర్ లాంచ్‌తో ఈ టూర్ ప్రారంభం కానుంది అని తెలిపారు. అలాగే మ్యాప్ యానిమేటెడ్ వీడియో కూడా పోస్ట్ చేశారు. పాట్నా తర్వాత, కోల్‌కతాకు టీమ్ వెళ్తుందని చూపిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాణ్యమైన బియ్యం.. కిలో రూ.34 లే

ఈ క్షణం నుంచే హెల్మెట్ మస్ట్.. లేకపోతే జాగ్రత్త !!

పెళ్లికూతురుని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ??

మా కుక్కను దొంగలెత్తుకెళ్లారు !! పోలీసులను ఆశ్రయించిన యజమాని

ఎడారి దేశం‌లో వింత.. మంచు దుప్పటిలో దుబాయ్‌

Published on: Nov 12, 2024 08:31 PM