Jani Master: ఇప్పుడే రిలీజ్ జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్స్.!

|

Oct 26, 2024 | 12:12 PM

లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ కు అక్టోబర్ 24 కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్టోబర్ 25న ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఇచ్చారు పుష్ప 2 నిర్మాతలు.

తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్టోబర్ 25న ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని సమాచారం. సరిగ్గా ఇదే సమయంలో జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఇచ్చారు పుష్ప 2 నిర్మాతలు. ఈ ఘటన జరగక ముందే పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని తీసుకున్నారు. అయితే అనూహ్యంగా జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో పుష్ప 2లో ఆ సాంగ్ ఎవరు కంపోజ్ చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పుష్ప 2 నేషనల్ ప్రెస్ మీట్ జరిగింది. అదే సమయంలో జానీ మాస్టర్ కి కూడా బెయిల్ మంజూరు కావడంతో రిపోర్టర్లు ఈ అంశంపై పుష్ఫ 2 నిర్మాతలను ప్రశ్నించారు. జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో పుష్ప 2లో సాంగ్ ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నారా అని మీడియా అడిగింది.

దీనికి నిర్మాత సమాధానమిస్తూ.. ‘ మేం ఆల్రెడీ కొరియోగ్రాఫర్ ను మార్చేశాం. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నాం. నవంబర్ 4 నుంచి షూట్ కూడా స్టార్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. అంటే పుష్ప-2 చిత్రానికి జానీ మాస్టర్‌ను దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయం జానీ మాస్టర్ కు బిగ్ షాక్ అని చెప్పవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.