Akira Nandan: తండ్రిని ఫాలో అవుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కొడుకు

Updated on: Jan 25, 2026 | 6:26 PM

భారతీయ సినీ ప్రముఖులు AI జనరేటెడ్ కంటెంట్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి సల్మాన్, చిరంజీవి వంటి స్టార్లతో పాటు, ఇప్పుడు అకీరా నందన్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. AI దుర్వినియోగాన్ని అరికట్టాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది డిజిటల్ యుగంలో గుర్తింపు పరిరక్షణకు కీలకమైన పోరాటం.

చూస్తుంటే ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీలు AI పై యుద్ధం చేస్తున్నట్టే కనిపిస్తోంది. AI జనరేటెడ్ కంటెంట్ నుంచి తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు కోర్టు బాట పట్టడం కనిపిస్తోంది. ఇప్పటికే సల్మాన్, అభిషేక్, ఐశ్వర్యతో పాటు.. మన స్టార్ హీరోలు చిరు, పవన్‌, నాగ్ , ఎన్టీఆర్‌ కూడా ఇదే చేశారు. ఇప్పుడు వీరందిర్నీ ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా కూడా తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. AI టెక్నాలజీని ఉపయోగించి తన రూపం, పేరుతో రూపొందిస్తున్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ ప్రచారాన్ని నిలిపివేయాలని అకీరా నందన్ కోర్టును రిక్వెస్ట్ చేశాడు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని తన పిటిషన్‌లో తెలియజేశాడు అకీరా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్‌.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది

Kashmir: భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా

రూపాయి @ రూ 91.65.. ఎందుకీ పరిస్థితి ??

మా వేలు ట్రిగ్గర్‌ పైనే ఉంది.. ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్‌

భారీ వర్షంలోనూ పరేడ్‌.. ఆసక్తిగా తిలకించిన జనం