రీ రిలీజ్ హంగామా.. సోలో డేట్‌ను లాక్ చేసిన పాత సినిమాలు
జూన్ 26న దొరికిన అరుదైన సోలో రిలీజ్ డేట్‌ను అఖిల్ సినిమా వదులుకోవడంతో ఆ తేదీని రీ రిలీజ్ చిత్రాలు ఆక్రమించాయి. మహేష్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, రాజ్ తరుణ్ ‘సినిమా చూపిస్తా మావా’ మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నాయి. కొత్త సినిమాల రేసు మాత్రం జూలై నుంచి మొదలుకానుంది.
ఇప్పుడున్న పోటీలో సోలో రిలీజ్ డేట్ దొరకడం అనేది దాదాపు అసాధ్యం. జూన్ 19కి కూడా అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. అలాంటిది జూన్ 26న దొరికిన బంగారం లాంటి సోలో డేట్ అఖిల్ వదిలేసారు. దాంతో అదే డేట్‌ను ఇప్పుడు పాత సినిమాలు వాడుకుంటున్నాయి. కొత్త సినిమా కంటే ఎక్కువగా రీ రిలీజ్‌లే జూన్ 26ను ఆక్యుపై చేస్తున్నాయి. మరి ఆ రోజు రాబోయే సినిమాలేంటి..? మహేష్‌ను ఈ మధ్య రీ రిలీజ్ సినిమాల్లోనే ఎక్కువగా చూస్తున్నారు అభిమానులు. వారణాసితో ఆయన బిజీగా ఉండటంతో.. గుంటూరు కారం తర్వాత పాత సినిమాలన్నింటినీ ఒక్కొక్కటిగా థియేటర్లోకి తెస్తున్నారు. కొన్నైతే మళ్లీ మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఒక్కడు సినిమాను రాధామాధవి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ జూన్ 26న మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. లెనిన్ సినిమా జూన్ 26 నుంచి వాయిదా పడిన తర్వాత వరసగా పాత సినిమాలనే తీసుకొస్తున్నారు. ఒక్కడు రీ రిలీజ్ అవుతున్న రోజే.. గబ్బర్ సింగ్ సినిమాను సైతం మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓసారి వచ్చింది ఈ సినిమా. తాజాగా మరోసారి జూన్ 26 గ్యాప్ వాడుకోడానికి గబ్బర్ సింగ్ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. జూన్ 26నే సినిమా చూపిస్తా మావాను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. రాజ్ తరణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. కారణం ఏదైనా లెనిన్ వాయిదా పడ్డాక కూడా జూన్ 26న కొత్త మూవీస్ ఏవీ అనౌన్స్ చేయలేదు. జూలైలోనే అసలు రేసు మొదలు కానుంది. లెనిన్ సైతం జూలై 10న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూలై అంతా కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ వీక్ నుంచే రేసు మొదలు కానుంది. జూలై 3న నాగబంధంతో పాటు సత్యదేవ్ రావ్ బహదూర్, అలియా భట్ ఆల్ఫా విడుదల కానున్నాయి. అలాగే జూలై 9న ఘట్టమనేని వారసుడు జయకృష్ణ పరిచయమవుతున్న శ్రీనివాస మంగాపురం రానుంది. అవి వచ్చేలోపే జూన్ 26న పాత సినిమాల సందడి కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూల్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే!
నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు
నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?