ఇవే.. నా లైఫ్‌లో హ్యాపీ‌డేస్‌.. పెళ్లి తర్వాత అఖిల్ మొదటి పోస్ట్‌!

Updated on: Jun 30, 2025 | 8:48 PM

అక్కినేని అఖిల్ జూన్ 6న పెద్దల సమక్షంలో.. తన ప్రియురాలు జైనాబ్‌ను గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి వేడుక తర్వాత 8న రిసెప్షన్ వేడుక కూడా అదిరిపోయే రేంజ్‌లో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్‌ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. చూడముచ్చటగా ఉన్నఅఖిల్- జైనాబ్ రవ్డీల పెళ్లి వేడుక ఫొటోలు ఇప్పటికీ నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అఖిల్ అక్కినేని పెళ్లి తర్వాత మొదటి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో మరిన్ని పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు అఖిల్. ‘నా లైఫ్‌లో అత్యుత్తమ క్షణాలను మీతో పంచుకోవాలని అనిపించింది. అందుకే ఈ ఫోటోలను షేర్ చేసుకుంటున్నా’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు అఖిల్. ‘నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు’ అని కూడా తన పోస్ట్‌లో ప్రస్తావించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రుద్ర క్యారెక్టర్‌.. ప్రభాస్‌ కాదు.. ఆ స్టార్ హీరో చేయాల్సింది

కన్నప్పలో ప్రభాస్‌ పెళ్లి టాపిక్..! విష్ణు దెబ్బకు రెబల్ స్టార్ విలవిల..

వార్ వన్‌ సైడ్.. దిక్కుతోచని స్థితిలో రజనీ

తిన్నడు ఏమో కానీ.. నెమలి అందర్నీ కట్టిపడేసింది !!

కుప్పకూలిన బంగారు గని, 11 మంది మృతి