Akhanda 2: బాలయ్యకు గుడ్ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?
అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ రూ. 600, 10 రోజుల పాటు పెరిగిన ధరలు (సింగిల్ స్క్రీన్‌కు రూ. 75, మల్టీప్లెక్స్‌కు రూ. 100) అమలులో ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం అనుమతిపై ఉత్కంఠ నెలకొంది, గతంలో ధరల పెంపు ఉండదని మంత్రి తెలిపారు.
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతిచ్చింది. అంతేకాదు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీలో డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది. ఈ స్పెషల్ షోకు టికెట్ ధర రూ. 600గా నిర్ణయించారు. అలాగే డిసెంబర్ 5న సినిమా విడుదలైన తర్వాత, మొదటి పది రోజుల పాటు పెరిగిన ధరలు అమలులో ఉంటాయి. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ. 75 పెంపు. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ. 100 పెంపునకు అనుమతినిచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తుందా అనే ఆసక్తి నెలకొంది. గతంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓజీ సినిమా విడుదల సమయంలో ఇకపై తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఉండదని తెలిపారు. అయితే ఇప్పుడు అఖండ 2 టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తారా లేదా అనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్ స్టేషన్‌కు శేఖర్ బాషా!
సామ్ లాగే ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ??
హైద్రాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ.. దానికంటే పెద్దగా ఉండబోతుందా
Avatar 3: జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్ 3 గ్రాండ్ రిలీజ్.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే
