Ajay Devgn: రేర్‌ రికార్డ్ సెట్ చేసిన అజయ్ దేవగన్‌

Updated on: Nov 17, 2025 | 6:29 PM

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఒకే ఏడాదిలో మూడు సీక్వెల్ చిత్రాలతో విజయం సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. రేడ్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2, దే దే ప్యార్ దే 2 వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన ఆయన, రాబోయే రోజుల్లో ధమాళ్, గోల్ మాల్, సింగం, షైతాన్, దృశ్యం వంటి సీక్వెల్స్ తో అలరించనున్నారు. ఈ వరుస విజయాలు ఆయన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం నార్త్ లో మంచి ఫామ్ లో ఉన్న ఆయన, తన సీక్వెల్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో విడుదలైన రేడ్ 2 మంచి సక్సెస్ అందుకుంది. పార్ట్ 2 తొలి భాగాన్ని మించి ఆకట్టుకుంది. అంతేకాకుండా, ఆగస్ట్ లో వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ 2 కూడా డీసెంట్ వసూళ్లను సాధించింది. తాజాగా విడుదలైన దే దే ప్యార్ దే 2 కూడా హిట్ గా నిలిచిందని బాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు సీక్వెల్ విజయాలతో, అజయ్ దేవగన్ ఒకే ఏడాదిలో మూడు సీక్వెల్ సక్సెస్ లు సాధించిన హీరోగా సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆయన నుంచి రాబోయే ధమాళ్ 4, గోల్ మాల్, సింగం, షైతాన్ 2, దృశ్యం వంటి సీక్వెల్స్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరు ??

Dulquer Salmaan: క్రేజీ మల్టీస్టారర్‌కు రెడీ అవుతున్న దుల్కర్‌ సల్మాన్‌

Keerthy Suresh: మరో ఇంట్రస్టింగ్ మూవీతో వస్తున్న కీర్తి సురేష్

వణికిస్తున్న చలిలోవాతావరణ శాఖ వర్షసూచన..

నీతా అంబానీ వాడే టీ కప్పుల ఖరీదెంతో తెలుసా ??