షో చూడు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పట్టు.. సుడిగాలి సుధీర్ నుంచి బంపర్ ఆఫర్ !
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సుడిగాలి సుధీర్ హోస్టింగ్, సెలబ్రిటీల సందడితో ఈ గేమ్ షోకు టాప్ రేటింగ్స్ వస్తున్నాయి. జూన్ 6 నుంచి సర్కార్ సీజన్ 5 ప్రారంభం కాగా ఇప్పటివరకు ఆరు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. ఈ శుక్రవారం అంటే జులై 18న ఏడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది.
కామాక్షి భాస్కర్ల, దక్ష నగార్కర్, కోమలి ప్రసాద్, హర్ష్ రోహన్, శ్రీదేవి, వాసంతిక, యాదమ్మ రాజు, బమ్ చిక్ బబ్లూ, హీరో విజయ్ ఆంటోని, బ్రిగిడా, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్.. ఇలా ఎందరో సెలబ్రిటీలు సర్కార్ గేమ్ లో ఆడి సందడి చేశారు. అయితే ఈసారి ఆడియెన్స్ కు కూడా బంపరాఫర్ ప్రకటించారు సర్కార్ మేకర్స్. సాధారణ ప్రేక్షకులు కూడా ఈ షోలో పాల్గొనే సువర్ణావకాశాన్ని కల్పించారు. అది కూడా ఇంటి నుంచే. ఇందుకోసం ఆహాలో ఈ గేమ్ షో చూస్తూ డిస్ ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే చాలు.. స్పోర్ట్స్ బైక్ లాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు గెల్చుకోవచ్చు. ఇక ఈ శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే రిలీజైంది. ఈ ఏడో ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ నటుడు శివ కుమార్, సింగర్లు సమీరా, రోల్ రైడాలు సందడి చేశారు. ఆట పాటలతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నెలకు 40 లక్షలు భరణంగా ఇవ్వాలి’ మాజీ భార్య దెబ్బకు..
బంగారం లాంటి ఛాన్స్ వస్తే.. ఈ పిల్ల కాళ్లతో తన్నింది..
3 నిమిషాలకు 3 కోట్లు.. ఏ స్టార్ ఫిల్మ్ అయినా.. మనీ మ్యాటర్లో నో కాంప్రమైజ్!