‘పుష్ప 2’ తర్వాత మరో బిగ్ సర్‌ప్రైజ్.. బాసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ?
‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని పలువురు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో బన్నీ సూపర్ హీరో మూవీ చేయనున్నారనే ప్రచారం మరోసారి జోరందుకుంది. బాసిల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు మరింత పెరిగాయి. అట్లీ, లోకేష్ కనగరాజ్ చిత్రాల తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశమున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. బన్నీ ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథలను సిద్ధం చేసేందుకు అదర్ లాంగ్వేజ్ మేకర్స్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఐకాన్ స్టార్ హెల్ప్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ లిస్ట్‌లో ఓ క్రేజీ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. తాజాగా ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఎవరా దర్శకుడు..? ఎంటా క్లారిటీ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీస్ లిస్ట్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఊరిస్తుంది. మాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా సెన్సేషన్ సృష్టించిన బాసిల్ జోసెఫ్ కెప్టెన్సీలో బన్నీ సూపర్ హీరో మూవీ చేయబోతున్నారన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఆ మధ్య అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాసిల్ జోసెఫ్ సందడి చేయటంతో ఈ న్యూస్ వైరల్ అయ్యింది. బన్నీ స్వయంగా బాసిల్‌ను రిసీవ్ చేసుకోవటం, తరువాత సుకుమార్, అట్లీతో బాసిల్ మాట్లాడుతూ కనిపించటంతో ఆ డిస్కషన్ అంతా బన్నీతో చేయబోయే సినిమా గురించే అన్న టాక్ వినిపించింది. బన్నీ, లోకేష్ కెప్టెన్సీ మూవీ ఎనౌన్స్ చేయటంతో బాసిల్ ప్రాజెక్ట్ ఉండదేమో అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి. కానీ మరోసారి క్రేజీ సూపర్ హీరో మూవీకి సంబంధించిన న్యూస్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. బాసిల్ తన సోషల్ మీడియాలో పేజ్‌లో ఐకాన్ అని రాసి ఉన్న క్యాప్ పిక్ షేర్ చేయటం, ఈ ప్రాజెక్ట్ ఆన్ కార్డ్స్ అన్న క్లారిటీ వచ్చేసింది. పుష్ప సిరీస్‌తో నేషనల్ సెన్సేషన్‌గా మారిన అల్లు అర్జున్, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే లోకేష్ కనగరాజ్ కెప్టెన్సీలో మరో మూవీని ఎనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత బాసిల్‌తో సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jason Sanjay: హీరోగా మారబోతున్న విజయ్ వారసుడు
సూపర్ హీరోల సీజన్ స్టార్ట్!.. అతీంద్రియ శక్తులతో బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న సౌత్ స్టార్స్
ఖాన్స్ త్రయానికి కష్టకాలం.. గాయాలు, ఫ్లాపులు, గ్యాపులతో బాలీవుడ్ బాద్‌షాల పరీక్ష!
కోలీవుడ్‌కు రెండో ఇల్లు మలేషియా.. స్టార్ హీరోల చూపంతా ఇప్పుడు అక్కడే!
