Jana Nayagan: ఆర్నెల్ల నిరీక్షణకు ముగింపు… ‘జన నాయగన్’ రాకతో బాక్సాఫీస్‌లో కొత్త సమరం..!
ఆరు నెలల వాయిదాలు, సెన్సార్ చిక్కులు దాటుకుని విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' జూలై 23న విడుదలకు సిద్ధమైంది. ఒకప్పుడు పొంగల్‌కు రావాల్సిన ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆలస్యమైన విడుదల, పైరసీ ప్రభావం మధ్య కూడా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధిస్తుందా అనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.
ఆరు నెలల నిరీక్షణ ఫలించింది.. ఎట్టకేలకు జన నాయకుడు రానున్నాడు.. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులు, సెన్సార్ చిక్కులు ఇవన్నీ దాటుకుని జన నాయగన్ థియేటర్స్‌లోకి రానున్నారు. మరి ఆర్నెళ్ల గ్యాప్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందా.. మైనస్ కానుందా..? ఇన్ని వాయిదాల తర్వాత ‘జన నాయగన్’పై ఇప్పటికీ అదే క్రేజ్ ఉందా..? బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్‌లో సరికొత్త రికార్డులను తిరగరాస్తుందా..? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జన నాయగన్‌కు అడ్డంకులు తొలగిపోయయి. ఎన్నో అవాంతరాల తర్వాత జూలై 23న విడుదల కానుంది. ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత వెంకట్ కే నారాయణ ఏకంగా ఢిల్లీలోని సెన్సార్ బోర్డుకు వెళ్లొచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా విడుదల ఆలస్యం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పొంగల్‌కే రావాల్సిన ఈ చిత్రానికి అప్పట్లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేసాక విడుదల ఆపేసారు. ఓ దశలో అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అన్ని అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు ‘జన నాయగన్’ థియేటర్లలోకి అడుగుపెడుతున్నాడు. వన్ లాస్ట్ టైమ్ అంటూ విజయ్‌ను థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఫ్యాన్స్. సినిమా విడుదల అంతలా ఆలస్యం కావడంతో ఇప్పటికీ అదే అంచనాలు, క్రేజ్ మార్కెట్లో ఉన్నాయా లేదా అనే ఆసక్తి నెలకొంది. పైగా పైరసీ ముందే వచ్చేసింది. ఈ నిరీక్షణ తర్వాత సినిమా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపిస్తుందా..? రికార్డ్ ఓపెనింగ్స్ తెస్తుందా అనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. మరి చూడాలిక.. జన నాయకుడు దూకుడు ఎలా ఉండబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!
Paradise: ‘ది ప్యారడైజ్’పై రూ.110 కోట్ల రూమర్స్… మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదే..!
Akhil Akkineni: ‘లెనిన్’తో మారిన అఖిల్… ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
ఒక్క సినిమాలో ఐదుగురు హీరోయిన్లు… గ్లోబల్ మూవీస్ కొత్త ఫార్ములా..!
చిన్న సినిమాల నుంచి వందల కోట్ల సీక్వెల్స్… బ్లాక్‌బస్టర్ల కొత్త లెక్కలు..!
