Srija: ఆయనే అలా చేస్తే ఎలా ?? సోషల్ మీడియాలో చర్చ

Updated on: Oct 15, 2025 | 6:32 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ ఫైర్ స్ట్రామ్ టాస్క్ వివాదాస్పదమైంది. పవన్, శ్రీజ మధ్య జరిగిన రింగ్స్ హ్యాంగ్ టాస్క్‌లో, బజర్ మోగిన తర్వాత పవన్‌కు లభించిన పాయింట్‌పై శ్రీజ అభ్యంతరం వ్యక్తం చేసింది. నాగార్జున పవన్ నిర్ణయాన్ని సమర్థించగా, సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శలు కురిపిస్తూ మీమ్స్ చేస్తున్నారు. ఈ ఘటన శ్రీజ ఎలిమినేషన్‌కు దారితీసింది.

మూడు టాస్కులు, ఆరు గొడవల మధ్య సాగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ ఫైర్ స్ట్రామ్ ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో వైల్డ్ ఫెలోస్ ఎంట్రీతో దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయి బయటకు రావాల్సి వచ్చింది. ధీమాన్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ మధ్య జరిగిన టూ స్టేజెస్ టాస్క్‌లో, పవన్, శ్రీజ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. రౌండ్ టూలో జరిగిన రింగ్స్ హ్యాంగ్ టాస్క్‌లో, శ్రీజ రెండు రింగ్స్‌ను కొక్కానికి చిక్కుకునేలా విసిరింది. ధీమాన్ పవన్ ఒకటి విసిరి, రెండోది జారవిడవగానే బజర్ మోగింది. బజర్ తర్వాత కూడా పవన్ చేతి నుంచి వెళ్లిన రింగ్ కొక్కానికి చిక్కుకుని అతనికి పాయింట్ లభించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూరప్ లో ప్రభాస్ ది రాజాసాబ్ సాంగ్ షూట్

ఆ విషయం లో పవన్‌ను ఫాలో అవుతున్న మలయాళ స్టార్‌

అందాల భామల టాలీవుడ్ రీఎంట్రీ.. సెకండ్ ఛాన్స్ తో అయిన సత్తా చూపుతారా

పాన్ ఇండియా ట్రెండ్ లో పెరిగిన గ్రాఫిక్స్ వాడకం

NTR మరో మైల్‌స్టోన్ సెట్ చేస్తారా..?