99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ
ఈ రోజుల్లో పెద్ద సినిమాల అధిక టికెట్ ధరలతో పోలిస్తే, చిన్న సినిమాలు ₹99 వంటి పాకెట్ ఫ్రెండ్లీ ధరలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'ఓం శాంతి శాంతి శాంతి', 'రాజు వెడ్స్ రాంబాయి' వంటి చిత్రాలు ఈ ట్రెండ్‌ను అనుసరించి విజయం సాధిస్తున్నాయి. ఇది చిన్న సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్. పెద్ద నిర్మాతలు కూడా ఈ వ్యూహాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఈ రోజుల్లో పెద్ద సినిమాలు విడుదలవుతుంటే.. టికెట్ రేట్లపైనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఒక్కో టికెట్ 400 నుంచి 500 వరకు వెళ్తుంది. ఇలాంటి సమయంలో చిన్న సినిమాలు మాత్రం హాయిగా పాకెట్ ఫ్రెండ్లీ రేట్లతోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. పాత రోజుల్లోకి తీసకెళ్తూ.. 99 రూపాయలకే సినిమా అంటున్నారు. తాజాగా మరో సినిమా కూడా అలాగే వచ్చేస్తుంది. 99 రూపాయలకే సినిమా.. ఈ మాట వినడానికే చాలా హాయిగా ఉంది కదా..? ఈ మధ్య కొన్ని సినిమాలకు ఇదే అప్లై చేస్తున్నారు నిర్మాతలు. తమ బడ్జెట్ లెక్కలేసుకున్నాక.. భారీ రేట్ అక్కర్లేదు.. సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్ 150 రూపాయలు చాలు అంటున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతి: సినిమా జనవరి 30న ఇదే రేట్లతో విడుదల కాబోతుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: సినిమాను సృజన్ ఎర్రబోలు నిర్మించారు.. తమ సినిమాను ఆడియన్స్‌కు మరింత చేరువ చేసేందుకు 99 రూపాయల టికెట్ వైపు అడుగేసారు ఈ నిర్మాత. ఇక జనవరి 1న విడుదలైన సైక్ సిద్ధార్థ్, వనవీర.. ఆ మధ్య మోగ్లీ లాంటి చిన్న సినిమాలు సైతం 100 రూపాయల రేట్‌తోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ఈ ట్రెండ్ మళ్లీ మొదలుపెట్టారు బన్నీ వాస్, వంశీ నందిపాటి. తొలిరోజు సింగిల్ స్క్రీన్స్‌లో 99, మల్టీప్లెక్స్‌లో 105 రూపాయలతో విడుదలైంది రాజు వెడ్స్ రాంబాయి. తాము విడుదల చేసిన ఈషా సినిమాకు 99 రూపాయల రేటే పెట్టారు బన్నీ వాస్. ఈ రేట్లు చిన్న సినిమాలకు బాగానే హెల్ప్ అవుతున్నాయి కూడా. మరి పెద్ద నిర్మాతలు కూడా దీనిపై ఓ లుక్కేస్తే బెటర్ ఏమో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lokesh Kanagaraj: లోకేష్ ప్రెస్ మీట్.. LCU సీక్రెట్స్ రివీల్
Andhra Pradesh: విశాఖ తీరంలో తండేల్ మూవీ సీన్ మరోసారి రిపీట్
AP Politics: రాజకీయ వేడిని పెంచిన వైసీపీ Vs టీడీపీ కామెంట్స్
Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ
Bigg Boss 9 Thanuja: తనూజ తీరుపై.. నెట్టింట ఫన్నీ.. క్రేజీ ట్రోల్