బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్
అడవి శేష్ తన సినీ ప్రయాణంలో హీరోగా ఎదిగి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. డెకాయిట్ ప్రమోషన్లలో భాగంగా, బాహుబలి షూటింగ్‌లో అనుష్కకు గాయం చేసిన షాకింగ్ ఘటనను ఆయన వెల్లడించారు. రాజమౌళి సూచన మేరకు ఒక సీన్‌లో అనుష్కను తన్నినప్పుడు మెడకు దెబ్బ తగిలిందని శేష్ చెప్పారు. ఈ సంఘటన తర్వాత తాను మరింత జాగ్రత్తగా ఉన్నానని తెలిపారు.
సినిమాల్లో హీరో అవ్వాలనే ఒకే ఒక ఎయితో… ఇండియాలో అడుగు పెట్టిన అడవి శేష్.. మొత్తానికి తన కష్టం అండ ట్యాలెంట్‌తో సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. చివరికి హీరోగా.. ఇప్పుడు పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ హీరోగా తన ఫిల్మ్ జర్నీని మలుచుకున్నాడు.ఈ క్రమంలోనే ప్రస్తుతం డెకాయిట్ సినిమాతో ఏప్రిల్ 10న మన మందుకు వస్తున్న ఈయన.. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా… ఓ షాకింగ్ ఇన్సిడెంట్‌ను షేర్ చేసుకున్నాడు. బాహుబలి టైంలో.. తన వల్ల అనుష్కకు గాయమైందంటూ చెప్పి.. ఇప్పుడు నెట్టంట వైరల్ అవుతున్నాడు. బాహుబలి సినిమాలో బల్లాలదేవ కొడుకు క్యారెక్టర్ చేసిన అడవి శేష్.. ఓ సీన్‌లో భాగంగా.. బాహుబలి తల్లి అనుష్కను కాలితో తన్నాల్సి వస్తుంది. అయితే ఆ సీన్‌లో శేష్ తన కాలితో అనుష్కను తన్నినా.. అది మానీటర్ ముందున్న డైరెక్టర్ జక్కన్నకు కృత్రిమంగా అనిపించిందట. పవర్ కనిపించట్లేదని కాస్త పవర్ పెట్టమని జక్కన్న కాస్త గట్టిగా తనకి చెప్పడంతో.. శేష్ అలాగే చేశాడట. దీంతో అనుష్కకు దెబ్బ తగిలిందట. అంతేకాదు ఆమె మెడ దగ్గర బెణికి గాయం కూడా అయినట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో స్వయంగా అడవి శేష్ వివరించాడు. ఇక అప్పట్నుంచి జాగ్రత్తగా ఉన్నానని.. ప్రతిసారి అనుష్కతో అలాంటి సీన్ ఉంటే అవ్వగానే ఏం అవ్వలేదు కదా, బాగానే ఉంది కదా అని అడిగేవాడినంటూ శేష్ చెప్పుకొచ్చాడు. తనని బల్లెంతో కొట్టి లేపే సీన్ లో కూడా జాగ్రత్తగా చేసి సీన్ అయ్యాక మీకు ఏం తగల్లేదు కదా అని అడిగా అని చెప్పుకొచ్చాడు అడవి శేష్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shanmukh Jaswanth: ఏంటి.. పెళ్లి అయిపోయిందా ?? ఫోటోలతో అభిమానుల్లో చర్చ
డే1 కలెక్షన్స్‌లో బైకర్‌ను దాటిన రాకాస !!
Bhanupriya: నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ
Komarakka: ‘కొమురక్క తేడా గాడు..’ సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్
Ramayana: 4000 కోట్ల రూపాయల అద్భుతం: ‘రామాయణ’ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ
