ఆన్‌లైన్‌ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్

Updated on: Dec 06, 2025 | 2:14 PM

ఆదితిరావు హైదరి కెరీర్‌లో సవాళ్లను, ఆన్‌లైన్ నెగిటివిటీని ఎలా అధిగమించారో వివరించారు. సక్సెస్ పొందాలంటే అడ్డంకులను దాటాలని ఆమె అన్నారు. డిజిటల్ మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, మార్ఫింగ్స్‌పై సమంత, రష్మిక వంటి సెలబ్రిటీలు గళం విప్పుతున్నారు. ఇలాంటి సామాజిక సమస్యలపై సెలబ్రిటీలు మాట్లాడటం వల్ల సమాజానికి మంచి జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

మనల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు తొక్కేయాలని చూస్తుంటారు. కానీ అలాంటి అడ్డంకుల్ని దాటుకుని ఎదిగినప్పుడే సిసలైన సక్సెస్‌ని ఆస్వాదించగలుగుతామని అంటున్నారు అదితిరావు హైదరి. అదితిరావు హైదరి ప్యాన్‌ ఇండియా ఆర్టిస్ట్. కేరక్టర్‌ నచ్చితే తప్ప సినిమాకు సంతకం చేయరనే పేరుంది. ఆమెను కేరక్టర్లు ఎప్పుడూ ఎగ్జయిట్‌ చేయవట. వాటికి తాను సరిపోతానని నమ్మే నిర్మాత, వాటిని సృష్టించి డీల్‌ చేసే డైరక్టర్‌ అంటేనే అమితమైన గౌరవమట. సౌత్‌లో మణిరత్నం నుంచి నార్త్ లో సంజయ్‌ లీలా భన్సాలి ప్రాజెక్టుల వరకు తాను దాన్నే నమ్మానంటారు ఈ బ్యూటీ. కెరీర్‌ ఎవరికీ పూలబాట కాదన్నది అదితి స్ట్రాంగ్‌గా నమ్మే విషయం. ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తేనే లైఫ్‌ ఉంటుందన్నది తన విషయంలో ప్రూవ్‌ అయిందంటారు ఈ లేడీ. ఓ వైపు నటనా పరమైన ఛాలెంజెస్‌ని ఫేస్‌ చేస్తూనే, మరోవైపు ఆన్‌లైన్‌ నెగటివిటీని కూడా ఓవర్‌ కమ్‌ కావాలని చెబుతున్నారు మిసెస్‌ సిద్ధార్థ్‌. డిజిటల్‌ మీడియాలో మహిళలు ఫేస్‌ చేస్తున్న ఇబ్బందుల గురించి రీసెంట్‌ టైమ్స్ లో సమంత కూడా స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు. సైబర్‌ వేధింపుల మీద మహిళల్లో అవగాహన కల్పించడానికి నడుం బిగించారు సామ్‌. ఓ వైపు అత్తారింట్లో అడుగు పెట్టిన సంతోషం, మరోవైపు తన తోటి మహిళల కోసం నిలబడాలనే ఉత్సాహం తనను ముందుకు నడిపిస్తోందన్నారు సామ్‌. మార్ఫింగ్స్ గురించి, మహిళలకు డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రష్మిక కూడా గళం విప్పారు. భవిష్యత్తులో ఇవి ఎలా ఉంటాయోననే ఆందోళన కూడా కనిపించింది ఆమె మాటల్లో. ఇలాంటి విషయాల మీద సెలబ్రిటీలు ఓపెన్‌గా మాట్లాడటం వల్ల సమాజానికి సాయపడ్డవారవుతారన్నది సోషల్‌ యాక్టివిస్ట్ ల నుంచి వినిపిస్తున్న మాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవతార్ 3 థియేటర్లలో మహేష్‌ !! హాలీవుడ్‌లో మార్కెట్‌ పై జక్కన్న మాస్టర్ ప్లాన్

iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే

TOP 9 ET News: అఖండ రిలీజ్‌ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య

స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!

వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అన్ననే..