ట్రోలింగ్‌ గురించి స్పందించిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నాయికలు

Edited By:

Updated on: Mar 25, 2026 | 11:04 PM

శ్రీలీల, రాశీఖన్నా సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ట్రోలింగ్ బాధలను పంచుకున్నారు. సోషల్ మీడియా నెగెటివిటీ, అవాస్తవ ప్రచారం వల్ల మానసికంగా ఎంత వేదనకు గురయ్యారో వివరించారు. ఇండస్ట్రీని వదిలేయాలని కూడా ఆలోచించామని, అయితే తల్లిదండ్రుల మద్దతు, ధైర్యంతో ఈ సవాళ్లను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మాట్లాడుతున్నది హీరోయిన్లయితే.. వారు ఏం చెప్పినా వినడానికి ఆనందంగానే ఉంటుంది. అంత అందమైన మాటలు చెప్పే నాయికలు కొన్నిసార్లు ఇబ్బంది పడ్డ విషయాలను పంచుకుంటుంటే మాత్రం మనసు చివుక్కుమంటుంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీలోనాయికలు ఓ విషయం మీద ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇంతకీ ఏ విషయం? ఈ ముద్దుగుమ్మల మాటేంటి? ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీలీల ‘ఈ ఇండస్ట్రీ నాకు వద్దు… నా వల్ల అవుతుందా అమ్మా?’ అని బాధపడ్డ రోజులు ఉన్నాయంటే ఎవరైనా అంగీకరించగలుగుతారా? ఆ విషయం అక్షరాలా నిజం అని అంటున్నారు శ్రీలీల. ట్రోలింగ్‌ వల్ల ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని చెబుతున్నారు మిస్‌ లీల. బాధపడి ఏడిస్తే, తల్లి ఓదార్చేవారన్నారు. సున్నితంగా ఉంటే సోషల్‌ మీడియా వల్ల నెగటివిటీ పెరిగిపోతుందని, ధైర్యంగా ఎదుర్కోగలగాలని చెప్పారు. సేమ్‌ ఈ ఇష్యూ గురించే మాట్లాడారు రాశీఖన్నా. నిజానిజాలు తెలుసుకోకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రచారం చేస్తుంటే.. ఇన్నాళ్ల క్రెడిబిలిటీ కుప్పకూలిపోతుందనే భయం వణికించేదని గుర్తుచేసుకున్నారు రాశీఖన్నా. క్లిక్‌ బైట్‌ల కోసమే అలా రాస్తు్న్నవారిని తలచుకుంటుంటే ఇప్పుడు పిటీ కలుగుతోందన్నారు ఈ లేడీ. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో కలిసి నటించిన వీరిద్దరు, భవిష్యత్తులోనూ కలిసి సినిమాలు చేసే అవకాశాలు వస్తే వదులుకోబోమని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Drishyam 3: దృశ్యం3 వాయిదా.. అసలు కారణమేంటి ??

హిట్‌ వచ్చినా.. బ్రేక్‌ తీసుకుంటున్న డైరెక్టర్లు

Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ

తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

Published on: Mar 25, 2026 11:04 PM
Follow Us