తెర ముందే కాదు.. తెర వెనుక కూడా మా సత్తా చాటుతా అంటున్న సామ్
సినిమా రంగంలో నటీమణుల పాత్రలు మారుతున్నాయి. కేవలం తెర ముందు మాత్రమే కాకుండా, పలువురు అగ్రతారలు ఇప్పుడు దర్శకుల బాధ్యతలు చేపడుతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, గీతు మోహన్ దాస్, కంగనా రనౌత్ వంటి వారు ఇప్పటికే ఈ మార్పునకు శ్రీకారం చుట్టగా, సమంత కూడా త్వరలో దర్శకత్వం వైపు అడుగులు వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్లు నాలుగు పాటలు, ఐదు సీన్లకు మాత్రమే పరిమితమనే పాత ఫార్ములా ఇప్పుడు కనుమరుగవుతోంది. నేటి తరం నటీమణులు తెరపై కీలక పాత్రల్లో కనిపిస్తూనే, తెర వెనుక దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌ను అనేకమంది అగ్ర కథానాయికలు, యువ హీరోయిన్లు అనుసరిస్తున్నారు. పవర్ఫుల్ క్యారెక్టర్స్‌తో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యారు. సరస్వతి అనే త్రిల్లర్ సినిమాకు ఆమె స్వయంగా నటిస్తూ, నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నటీమణులు కేవలం నటనకే పరిమితం కాకుండా, సినిమా నిర్మాణ ప్రక్రియలో అన్ని విభాగాలలో తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారని రుజువు చేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డిఫరెంట్ లుక్స్ తో అభిమానుల అంచనాలు పెంచేస్తున్న స్టార్ హీరోలు
ఓజీ-2 అప్‌డేట్ ఇచ్చిన సుజీత్.. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
కొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్స్..
