Shweta Basu: ఆ తెలుగు హీరో పదే పదే ఇబ్బంది పెట్టారు..

Updated on: Feb 20, 2025 | 12:33 PM

శ్వేతా బసు ప్రసాద్.. చైల్డ్ ఆర్టిస్ట్‌ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈమె.. తన కెరీర్ పరంగా మాత్రం కాస్త వెనకబడే ఉంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే.. ఊహించని వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆ తర్వాత ఓ కేసులో అరెస్టై ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీ అండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఆ తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సినిమాలు.. సిరీస్‌లు అనే తేడా లేకుండా తనకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటోంది. ఇక ఈక్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు ప్రసాద్.. తెలుగు సినిమా హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని.. కెరీర్ పరంగానే బాగానే ఉన్నానని చెప్పిన శ్వేతా బసు.. ఆక్రమంలోనే ఓ తెలుగు సినిమా హీరోతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అందరితో పంచుకుంది. ఆ తెలుగు సినిమా హీరోతో సినిమా చేస్తున్న సమయంలో ఎంతో ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చింది. అతడి హైట్ ఆరు అడుగులు అని.. ఆమె హైట్ 5.2 అడుగులు ఉండడంతో ప్రతి ఒక్కరు ఎగతాళి చేశారని చెప్పింది. హీరో కూడా తన హైట్ గురించి ప్రస్తావిస్తూ పదే పదే ఎగతాళి చేసేవాడని.. దాంతో తాను కాస్త ఫీలైనట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు అతడు తెలుగు హీరో అయినప్పటికీ తెలుగు మాత్రం సరిగ్గా మాట్లాడడమే రాదని.. అలాంటిది తన భాష గురించి పట్టించుకోకుండా తన హైట్ గురించి కామెంట్ చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేసింది.అయితే శ్వేతా బసు ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండడంతో….. ఎవరా తెలుగు హీరో అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. ఆమె యాక్ట్ చేసిన హీరోల లిస్టును బయటికి తీసి.. ఆ హీరో ఎవరనేది గెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంత మంది నెటిజన్స్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vicky Kaushal: అందరికీ షాకిస్తున్న ఛావా హీరో సంపాదన..