Loading video

Samyuktha Menon: నేను ఆల్కహాల్ తాగుతాను.. మోహమాటం లేకుండా స్టేజ్‌పై చెప్పేసిన సంయుక్త

|

Feb 18, 2025 | 11:14 AM

తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. పవన కల్యాణ్ నటించిన భీమ్లా నాయ‌క్ మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ.. మొత్తానికి తెలుగులో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దూసుకెళుతోంది ఈ క్రేజీ బ్యూటీ. ప్రస్తుతం ఈమె.. స్వ‌యంభు, అఖండ‌2 తో పాటు పలు క్రేజీ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. త‌న లేటెస్ట ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది. ఈ విషయం పక్కకు పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్‌నే షాకయ్యేలా చేస్తున్నాయి. తన లైఫ్ స్టైల్ గురించి చెప్పే క్రమంలో సంయుక్త కొన్ని సంచలన విషయాలు బయట పెట్టింది. త‌న‌కు ఆల్క‌హాల్ సేవించే అల‌వాటుంద‌ని, కానీ అదే ప‌నిగా తాగ‌న‌ని, ఎప్పుడైనా స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువైన‌ప్పుడు మాత్ర‌మే కొంచెం తీసుకుంటాన‌ని మొహ‌మాటం లేకుండా చెప్పింది. సాధారణంగా హీరోయిన్ల‌కు ఇలాంటి అల‌వాట్లున్నా ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ సంయుక్త మీనన్ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది. ప్రస్తుతం సంయుక్త కామెంట్స్ విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అదే క్రమంలో ఎలాంటి మొహమాటం లేకుండా, ముక్కసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పిన ఈ అందాల తార ను చాలా మంది పొగిడేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: కన్ఫ్యూజన్‌లో రామ్ చరణ్‌, బుచ్చిబాబు | ‘చిరంజీవి తొందర పడాల్సిందే’