అర్ధరాత్రి నటితో అనుచిత ప్రవర్తన.. అసలేం జరిగింది ??
ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌లో చేదు అనుభవం ఎదురైంది. సాంస్కృతిక కార్యక్రమంలో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా నిర్వాహకులు ఆమెను అవమానించారని ఆరోపణ. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా స్టేజ్ దిగిపోవాలని ఆదేశించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బొంగావ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని మిమీ డిమాండ్ చేశారు.
ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌లో చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే నిర్వాహకులు తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా, బొంగావ్‌లో ‘నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్’ ఆధ్వర్యంలో ఈ నెల 25న అర్ధరాత్రి ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. మిమీ చక్రవర్తి ప్రదర్శన ఇస్తున్న సమయంలో నిర్వాహకులలో ఒకరైన తన్మయ్ శాస్త్రి అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఆపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను స్టేజ్ దిగి వెళ్ళిపోవాలని ఆదేశించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ అనుచిత ప్రవర్తనపై మిమీ చక్రవర్తి సోమవారం బొంగావ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కళాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TG Vishwa Prasad: పాపం విశ్వ ప్రసాద్ !! ’15 సినిమాలు తీస్తే.. రెండే హిట్టు
Ram Charan: అక్కకు దిష్టి తగలకుండా చరణ్ స్పెషల్ గిఫ్ట్
Mana Shankara Vara Prasad Garu: ఆ విషయం లో చిరు సినిమాకు హైకోర్టులో నిరాశ
