Loading video

‘కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్‌ తో చిక్కుల్లో హీరోయిన్

|

Feb 18, 2025 | 11:33 AM

పరిచయం టూ ఫ్రెండ్ షిప్.! ఫ్రెండ్ షిప్ టూ ప్రేమ! ఇలా ఓ అమ్మాయి- అబ్బాయి మధ్య.. రిలేషన్ షిప్ మారుతూ ఉండడం కామన్‌. ఇదే హీరోయిన్లలోనూ జరగడం కూడా కామన్. కానీ ఈ కామన్‌ థింగ్‌ను ఒప్పుకోకుండా తప్పించుకుని తిరిగే అలవాటున్న హీరోయిన్లు.. ఎప్పుడూ తాము రిలేషన్‌ షిప్‌లో ఉన్నామని బయట పడరు.

ఒక దొరికిపోయినా.. కో స్టార్ అంటూ ఫ్రెండ్ అంటూ.. బుకాయిస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ల పై ఇలాంటి టాక్ ఉన్న ఈ సిట్య్చూవేషన్లో ప్రేమలు హీరోయిన్ మమితా బైజూ.. ఏకంగా తన కోస్టార్‌ను ఫ్రెండ్ అంటూ.. మెన్షన్ చేస్తూనే లవ్‌ యూ అన్నారు. తన పోస్ట్‌కు లవ్‌ ఎమోజీలు జోడించారు. ఎప్పటిలానే ఇప్పుడు తన లవ్‌ టాపిక్ తో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్ చేసే క్రేజీ కామెంట్స్‌ కారణంగా అక్రాస్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మమితా బైజు.. ఇదే సినిమాలో తన కో స్టార్ గా యాక్ట్‌ చేసిన సంగీత్‌ ప్రతాప్‌తో బెస్ట్ దోస్తాన్ చేస్తోంది. ఈ సినిమా బిగినింగ్ నుంచి తనతో కాస్త క్లోజ్‌గా కనిపిస్తూనే నెట్టింట వైరల్ కూడా అయ్యేది. ఇక క్రమంలోనే ఈ బ్యూటీ.. సంగీత్‌ కు బర్త్‌డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ షిప్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఇంతవరకూ బానే ఉన్నా.. ఆ పోస్ట్‌లో.. ఎవ్‌రీ సింగిల్ టైం నన్ను సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటావు.. లవ్‌ యూ సంగీతప్ప అంటూ రాసుకొచ్చింది. దీంతో స్పెసిఫిక్ గా ఈ లైన్‌ను పట్టుకున్న కొంత మంది నెటిజన్లు.. వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్‌ థింగ్ ఉందని అనుమాన పడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

థియేటర్లో వెటకారంగా కుర్రాళ్ల డ్యాన్స్.. సాయి పల్లవి ఫ్యాన్స్‌ సీరియస్

Samyuktha Menon: నేను ఆల్కహాల్ తాగుతాను.. మోహమాటం లేకుండా స్టేజ్‌పై చెప్పేసిన సంయుక్త

TOP 9 ET News: కన్ఫ్యూజన్‌లో రామ్ చరణ్‌, బుచ్చిబాబు | ‘చిరంజీవి తొందర పడాల్సిందే’