Charith Manas: గుడ్‌ న్యూస్‌.! 2 ఏళ్లలో సినిమాల్లోకి జూనియర్ మహేష్‌.. క్లారిటీ వీడియో.

|

Jan 10, 2024 | 2:12 PM

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మహేష్.. ఇప్పుడు గుంటూరు కారం మూవీతో ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు కృష్ణ అల్లుడిగా వెండితెర అరంగేట్రం చేసిన సుధీర్ బాబు..వైవిధ్యమైన కథలు.. పాత్రలను ఎంచుకుంటూ తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు.

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మహేష్.. ఇప్పుడు గుంటూరు కారం మూవీతో ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు కృష్ణ అల్లుడిగా వెండితెర అరంగేట్రం చేసిన సుధీర్ బాబు..వైవిధ్యమైన కథలు.. పాత్రలను ఎంచుకుంటూ తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు. తన నటనతో అటు మాస్.. ఇటు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరోగా సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. అతనెవరో తెలుసా ?.. టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్. హీరో సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడి పేరు చరిత్ మానస్. చిన్న కొడుకు పేరు దర్శన్. చరిత్ మానస్ మేనమామ మహేష్ పోలికలతో కనిపిస్తున్నాడు. కొన్నిరోజులుగా అతడికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. తన తండ్రిలాగే జిమ్నాస్టిక్స్, డాన్స్ టాలెంట్స్ చరిత్లో మెండుగా ఉన్నాయి. దానికితోడు లుక్స్‌ అండ్ స్మైల్‌ అచ్చం మహేష్‌లా ఉండడంతో…జూనియర్ మహేష్ అనే ట్యాగ్ ఎప్పుడో వచ్చింది ఈ యంగ్ బాయ్‌. అలాంటి ఈ బాయ్‌ సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు సుధీర్ బాబు. రీసెంట్‌గా తన భార్యా.. పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సుధీర్ బాబు… ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ‘ఎక్కడికి వెళ్లినా చరిత్ లాంచ్ గురించే అడుగుతున్నారు. ఇంక రెండుమూడేళ్లు సమయం ఉంది. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చరిత్ మానస్ ఓల్డ్‌ వీడియోలు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos