తండ్రిని పట్టుకుని ఎమోషనల్.. అమీర్‌ఖాన్‌ కూతురుకు ఏమైంది ??

Updated on: Mar 26, 2025 | 6:19 PM

బాలీవుడ్‌ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆయన కుమార్తె ఇరా ఖాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోమవారం ముంబైలో తండ్రీకూతుళ్లకు సంబంధించిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. అమీర్, ఇరా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుంటున్న అనేక చిత్రాలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా చక్కర్లు కొడుతున్న వీడియోలో మాత్రం ఇరా భావోద్వేగానికి లోనవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో, ఇరా తన కారు వైపు నడుస్తూ అమీర్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత అమీర్‌ఖాన్‌ వెనక్కి తిరిగి, ఆమెను తిరిగి పిలిచి, హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. వారు విడిపోయే ముందు ఆమె నుదిటిని కూడా సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇరా ఖాన్ నల్లటి టీ-షర్టు, కార్గో షూలను ధరించి ఉంది. అమీర్ ఖాన్ నీలిరంగు టీ-షర్టు, డెనిమ్స్, తెల్లటి షూలను ధరించారు. “ఇరా ముఖంలో ఏడుపు తన్నుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోపై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్యాన్స్‌ పరువుతీయడంతో.. వేదికపైనే బోరున ఏడ్చిన స్టార్ సింగర్

అంతరిస్తున్న పిచ్చుకలు.. వినాశనం తప్పదా..?

వేసవిలో ఇవి తాగితే ఆరోగ్యంతో పాటు.. అందం మీ సొంతం

హుండీలో వేసిన నిలువుదోపిడి మొక్కు.. ఎలా మాయం అయింది.. మళ్లీ ఎలా వచ్చింది ?

క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా ?? దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు