OTTలోకి ‘శంబాల’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆది సాయికుమార్ నటించిన హిట్ చిత్రం శంబాల ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కొత్త దర్శకుడు యుగేందర్ ముని తెరకెక్కించిన ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. జనవరి 22 నుండి శంబాల ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత శంబాల చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. యుగేందర్ ముని దర్శకత్వం వహించిన ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కథనం రొటీన్ అయినప్పటికీ, దానిని తెరకెక్కించిన తీరు కొత్తగా ఉండటంతో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.దాదాపు 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన శంబాల, లాంగ్ రన్‌లో 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇది ఆది సాయికుమార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం :