Jailer Movie: జైలర్‌ సినిమా చూడ్డానికి జపాన్‌నుంచి ఇండియాకు వచ్చిన దంపతులు..

|

Aug 14, 2023 | 8:36 AM

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీ భాష, ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపీదించుకున్నారు. రజినీ నటించిన తాజా చిత్రం జైలర్‌ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలో తమ ఆరాధ్య నటుడి సినిమాను చూసేందుకు ఓ జంట ఏకంగా జపాన్‌నుంచి ఇండియాకు వచ్చింది.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీ భాష, ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపీదించుకున్నారు. రజినీ నటించిన తాజా చిత్రం జైలర్‌ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలో తమ ఆరాధ్య నటుడి సినిమాను చూసేందుకు ఓ జంట ఏకంగా జపాన్‌నుంచి ఇండియాకు వచ్చింది. స్థానిక థియేటర్లలో తోటి అభిమానుల మధ్య చూడాలని జపాన్‌లోని ఒసాకాకు చెందిన యసుదా హిడెతోషి, అతని భార్యతో కలిసి చెన్నైకి వచ్చారు. చెన్నైలోని థియేటర్‌లో తమిళ తంబీలతో కలిసి సినిమా చూసి ఖుషీ అయ్యారు. రజనీకి వీరాభిమాని అయిన యసుదా.. జపాన్‌లోని రజినీకాంత్‌ ఫ్యాన్‌ క్లబ్‌కి లీడర్‌. అభిమానులందరితో కలిసి సినిమా చూడటానికి తాము ఇక్కడి వచ్చినట్లు ఆయన చెప్పారు. సూపర్‌స్టార్‌ హీరోగా యువ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన జైలర్‌’ చిత్రం గురువారం విడుదలైంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేశారు. కాగా, గురువారం తెల్లవారుజాము నుంచే తమిళనాడులోని థియేటర్ల వద్ద రజనీ అభిమానుల సందడి మొదలైంది. డ్యాన్సులు, డప్పు చప్పుళ్లతో టాకీసుల పరిసరాలు మారుమోగాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...