2027 సమ్మర్ క్లాష్.. ఇప్పటి నుండే రచ్చ రచ్చ

Edited By:

Updated on: Jan 20, 2026 | 4:11 PM

2027 సమ్మర్ సినీ బాక్సాఫీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ 'స్పిరిట్', రాజమౌళి 'వారణాసి', అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రాజెక్టులు ఒకేసారి రాబోతున్నాయనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్‌గా మారే అవకాశం ఉంది. ఈ మెగా పోరుకు గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ అవుతోంది.

ఇంకా 2026 సమ్మరే రాలేదు, ఆల్రెడీ సిల్వర్‌ స్క్రీన్‌ మీద 2027 సమ్మర్‌ హీట్‌ కూడా మొదలైంది. నేషనల్‌ లెవల్‌లో.. ఇంకా చెప్పాలంటే గ్లోబల్ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఆ సీజన్‌నే టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే నెక్ట్స్ ఇయర్‌ సమ్మర్‌ గురించి డిస్కషన్‌ జరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా స్పిరిట్‌ రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేసిన డార్లింగ్‌ ప్రభాస్‌, కొత్త డిస్కషన్‌కు తెరలేపారు. 2027 సమ్మర్‌లో బిగ్‌ ఫైట్‌ తప్పదన్న సిగ్నల్స్ ఇచ్చారు. దీంతో ఆ సీజన్‌లో రాబోయే మిగతా సినిమాలేంటన్న చర్చ మొదలైంది. ఈ లిస్ట్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌ బాక్సాఫీస్‌ను ఊరిస్తున్నాయి. స్పిరిట్ కన్నా ముందే 2027 సమ్మర్ మీద కర్చీఫ్‌ వేసిన మూవీ వారణాసి. అఫీసియల్‌గా డేట్ లాక్ చేయపోయినా.. 27 సమ్మర్‌లోనే సినిమా రిలీజ్‌ అని, ఎనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లోనే కన్ఫార్మ్ చేసింది టీమ్‌. అదే టార్గెట్‌తో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. గ్లోబల్ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్‌ – ఏఏ 22, ఎన్టీఆర్‌ – నీల్ ప్రాజెక్ట్స్‌ కూడా 2027 సమ్మర్‌ టార్గెట్‌గానే సిద్ధమవుతున్నాయన్న టాక్‌ ఉంది. అదే నిజమైతే.. 2027 సమ్మర్‌ క్లాష్‌ ఇండియన్‌ స్క్రీన్ మీదే బిగ్గెస్ట్ ఎవ్వర్‌ క్లాష్ అవుతుందంటున్నారు క్రిటిక్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే కలెక్షన్ల వర్షం.. లేకుంటే

Ram Charan: నా కెరీర్ లోనే ఇది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.. అంటున్న చెర్రీ

హిట్టు కోసం పక్క చూపులు చూస్తున్న తమిళ దర్శకులు..

3 మేడలు, కారు, వడ్డీ వ్యాపారం.. ఈ బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

టాయిలెట్‌లో పేపర్‌‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌