ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే

Updated on: Jan 03, 2026 | 11:44 AM

ORS, ఎలక్ట్రోలైట్లు వాంతులు, విరేచనాల వంటి సమస్యల్లో అవసరం. అయితే, వీటిని అధికంగా తీసుకోవడం ప్రమాదకరం. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, మూత్రపిండాలపై భారం పెరిగి దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. తీవ్ర లక్షణాలు లేనప్పుడు మామూలు నీరే సరిపోతుంది. ORS ప్యాకెట్‌పై సూచించిన మోతాదులోనే వాడాలి. సొంత వైద్యం మానుకుని వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.

ORS ఎలక్ట్రోలైట్లు అవసరమే కానీ అవి కేవలం శరీరం ఎంత కోల్పోయిందో అంత వరకే అవసరం. ఏదైనా మందులాగే.. ఎలక్ట్రోలైట్‌లు అతిగా తాగుతున్నా హానికరమే. సాధారణంగా వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరం ఉన్నప్పుడు శరీరం నుంచి సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్‌లు వేగంగా బయటకు పోతాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి, త్వరగా కోలుకోవడానికి చాలా మంది ORS డ్రింక్స్ లేదా పౌడర్‌ను ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అయితే.. ఈ అతి మంచిది కాకపోవచ్చని.. ఇది ప్రమాదకరమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్ అనేవి శరీరంలోని ద్రవ స్థాయిలను సమతుల్యం చేయడానికి, నాడీ, కండరాలు, గుండె, మెదడు వంటి కీలక అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడే ఖనిజాలు. కానీ వీటిని అవసరం కంటే ఎక్కువ తీసుకోవడం వలన ఓవర్‌డోస్ అయ్యే ప్రమాదం ఉంది. అధిక మొత్తంలో ఎలక్ట్రోలైట్‌లు తాగడం మూత్రపిండాలపై అదనపు భారాన్ని పెంచుతాయి. మూత్రపిండాలు ఈ అదనపు ఎలక్ట్రోలైట్‌లను బయటకు పంపడానికి కష్టపడతాయి.. దీర్ఘకాలంలో మూత్రపిండాల పనితీరు దెబ్బతినడానికి దారితీయవచ్చు. సాధారణంగా మీకు తీవ్రమైన వాంతులు లేదా అతిసారం వంటి సమస్యలు లేకపోతే.. మామూలు నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ నివారణకు సరిపోతుంది. మీరు ఎలక్ట్రోలైట్ పౌడర్‌లను ఉపయోగిస్తుంటే.. ప్యాకెట్‌పై సూచించిన నిర్ణీత మోతాదు ప్రకారం.. తగినంత నీటిలో కలిపి మాత్రమే తీసుకోవాలి. పౌడర్‌ను తక్కువ నీటిలో కలిపి తాగడం వలన ఎలక్ట్రోలైట్ సాంద్రత పెరిగి సమస్యలు తలెత్తుతాయి. ఎలక్ట్రోలైట్లు అవసరమే.. కానీ అవి కేవలం శరీరం ఎంత కోల్పోయిందో అంత వరకే అవసరం. ఏదైనా మందులాగే ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్ల అధిక వినియోగం హానికరమే. మీ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా మీకు అనుమానం ఉంటే సొంత వైద్యం మానుకుని వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు సూచించిన సమాచారాన్ని మేం మీకందిస్తున్నాం. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే

రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు

Hyderabad: ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే

వందేభారత్‌.. 180 కి.మీ స్పీడ్‌.. గ్లాస్‌ వణకలేదు..నీళ్ళు తొణకలేదు

LPG Gas Cylinder: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర