చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
శీతాకాలంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం సహజం. అయితే, ఈ అత్యల్ప ఉష్ణోగ్రతల పరిస్థితులు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. శరీరంలో అంతర్గతంగా అవసరమైన ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, రక్త ప్రసరణ మందగించడం, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
అయితే, ఆహారంలో చిన్నపాటి మార్పు చేసుకుంటే చాలా సమస్యలను అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. చలికాలంలో ప్రతిరోజూ 2 గుడ్లు తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో అధిక ప్రోటీన్లు, ఒమేగా-3తో పాటు కొన్ని విటమిన్లు లభిస్తాయని, ఇవి శీతాకాలంలో వచ్చే అనేక సమస్యలను దూరం చేస్తాయని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా గుడ్ల ద్వారా పుష్కలంగా లభించే విటమిన్-డీ ఎముకలు, మెదడు కణాల పనితీరును మెరుగుపరచడంలో చక్కగా ఉపయోగపడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..