Hyderabad Rains: గంట వర్షానికే ఆగమైన ఐటీ కారిడార్.. టెక్కీలు పరేషాన్..
మూడు రోజులు భారీ వర్షం పడటంతో ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ జాం చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యమ్నాయా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మైండ్ స్పేస్, రహేజా, ఐకియా, రాయదుర్గం పరిధిలోని ఐటీ కంపనిల షిఫ్ట్ టైం లు చేంజ్ చేశారు. భారీ వర్షాల క్రమంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరించిన పోలీసులు.
Hyerabad News: మూడు రోజులు భారీ వర్షం పడటంతో ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ జాం చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యమ్నాయా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మైండ్ స్పేస్, రహేజా, ఐకియా, రాయదుర్గం పరిధిలోని ఐటీ కంపనిల షిఫ్ట్ టైం లు చేంజ్ చేశారు. భారీ వర్షాల క్రమంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరించిన పోలీసులు. అ తర్వాత చేతులు ఎత్తేశారు… దింతో గంటలో కురిసిన భారీ వర్షానికి ఐటీ కారిడార్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ఆఫీస్ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలోనే భారీ వర్షం కురవడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటు వాతావరణ శాఖ ముందస్తు అలెర్ట్ జారీ చేయకపోవడంతో పోలీసులు కూడా అప్రమత్తం కాలేకపోయారు. ఓ గంటలోనే కుండపోత వర్షం కురవడంతో పోలీసులు తెరుకునే లోపే ఐటీ కారిడార్ లో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాంలు చోటు చేసుకున్నాయి. ఐకియా నుండి రాయదుర్గం వరకు ట్రాఫిక్ మూవ్మెంట్ స్లో గా ఉంది…ఈ రూట్ లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మరో వైపు షిఫ్ట్ చెంజ్ కు చేసిన కంపనిలు నిబంధనలు పాటించకపోవడం తో సమస్యలు తలెత్తుతున్నాయి. కేవలం మూడు రోజులపాటు రూల్స్ పాటించి చేతులు ఎత్తేసాయి ఐటీ కంపెనీలు. దీని పై వర్ష కాలం ముగేసేవరకు పర్యవేక్షణ ఉంటేనే ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అంటున్నారు వాహనదారులు.
