Loading video

అందంగా.. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..?

|

Mar 17, 2025 | 7:36 PM

సాధారణంగా ఆవు, లేదా గేదె పాలు ఎక్కువగా ప్రజలు ఉపయోగిస్తారు. పాలు ఆరోగ్యానికి మంచివని, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన కాల్షియం అందుతుందని నిపుణులు చెబుతారు. ఈ పాలు సహజంగా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. మహా అంటే లీటరు రూ.200లు ఉండొచ్చు.. కానీ కొన్ని జంతువులనుంచి తీసే పాలు వేలల్లో ధర పలుకుతుంటాయి.

అందుకు కారణం వాటిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలే. హిందువులు ఆవుపాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని విశ్వసిస్తారు. ఆవుపాలు తల్లిపాలతో సమానం అంటారు. పిల్లల ఆరోగ్యానికి ఆవు పాలు ఎంతో దోహదపడతాయి. ఇప్పడు ఇదేకోవలోకి గాడిదపాలు వచ్చి చేరాయి. ఆవు, గేదె పాలతో పోలిస్తే గాడిద పాలు చాలా ఖరీదైనవని తెలుసా..? లీటరు గాడిద పాలు దాదాపు రూ.6,000 పలుకుతున్నాయి. దీని వెనుక ముఖ్య కారణం ఇందులో ఉన్న అధిక పోషక విలువలే. గాడిద పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్-డి వంటి పోషకాలు అధికంగా ఉండటమే. ఆరోగ్యంగా, అందంగా ఉండాలనుకునే వారికి గాడిద పాలు మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చే గుణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో గాడిద పాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గాడిద పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంపై నలుపు తగ్గి, సాఫ్ట్‌గా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలర్జీ ఉన్నవారు గాడిద పాలను నిపుణులు సూచనమేరకు తీసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్‌ని మార్చడం ఎలా?

వారానికి 90 గంటల పని చేయాలని సూచిస్తున్న కంపెనీల సీఈఓలు.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే

చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్‌.. ఖర్చు రూ. 19 లక్షలా

అలర్ట్‌.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..