పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే ఈ ఏడాది చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే మంచు కురుస్తోంది. ఉదయం పూట మంచు కారణంగా రోడ్లపై వాహనాలు కనిపించడం లేదు. కానీ రాత్రిళ్లు మాత్రం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఇలా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది చలి తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. మరోవైపు వాయువ్య, మధ్య, ఈశాన్య భారతాన్ని రుతు పవనాలు నిర్దిష్ట సమయం కంటే ఒక వారం ఆలస్యంగా వీడి వెళ్లాయి. అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను దాటి పవనాలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో రాష్ట్రంలో చలి తీవ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రెండేళ్ల నుంచి చలి తీవ్రత అధికంగానే ఉంటోంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా వైద్యులు పలు సలహాలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రక్తనాళాలు కుచించుకుపోవడంతో పాటు, రక్తం గడ్డ కట్టే సమస్యలు ఈ కాలంలో అధికంగా ఉంటాయనీ కనీసం సంవత్సరానికి ఒకసారైనా బాడీ చెకప్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు ??
ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!
మందేసి.. దోసె తింటే మీ పని మటాష్ !! ఇప్పటికైనా జాగ్రత్తపడండి