ఎల్పీజీ కంటే ఈ సిలిండర్‌ చాలా డేంజర్‌.. ఎందుకో తెలుసా ??

|

Oct 31, 2024 | 8:32 PM

ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్పీజీ సిలిండర్ పేలడం ద్వారా మరణాలు సంభవించిన సందర్భాలు ఎన్నో చూసాం. అయితే ఎల్పీజీ సిలిండర్లకంటే ఆక్సిజన్‌ సిలిండర్‌లు మరింత ప్రమాదకరమని మీకు తెలుసా? ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఓ ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది.

ఈ పేలుడు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. దీంతో ఆక్సిజన్‌ సిలిండర్‌కు సంబంధించి చర్చ తెరపైకి వచ్చింది. సాధారణంగా ఎల్పీజీ సిలిండర్‌లు పేలడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటాం. కానీ ఆక్సిజన్‌ సిలిండర్‌ కూడా పేలుడుకు దారి తీస్తుంది. నిజానికి ఎల్పీజీ, గ్యాస్‌ ఆక్సిజన్‌ రెండు వాయువులే అయినప్పటకీ.. వాటి వినియోగం, నిల్వలో తేడా ఉంటుంది. అయితే పేలుడు విషయంలో ఎల్పీజీ, ఆక్సిజన్‌ రెండూ ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఎల్పీజీలో ఉండే ప్రొపేన్, బ్యూటేన్ మిశ్రమం కారణంగా అది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ గాలి మంటను తాకగానే పేలుడు సంభవిస్తుంది. ఎల్పీజీ పేలినప్పుడు అగ్ని ప్రమాదానికి దారి తీస్తుంది. ఇక ఆక్సిజన్‌ సిలిండర్‌ విషయానికొస్తే.. సాధారణంగా ఆక్సిజన్‌ వాయువు మంటను పెంచడంలో సహాయపడుతుంది. మంటకు ఆక్సిజన్‌ తోడైతే అది మరింత భయంకరంగా ఉంటుంది. ఆక్సిజన్ ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. ఈ వేడికి రాయి కూడా కరిగిపోతుంది. ఎల్‌పీజీ బ్లాస్ట్ కంటే ఆక్సిజన్‌ బ్లాస్ట్ ఎక్కువ ప్రమాదకరం కావడానికి కారణం ఇదే. ఆక్సిజన్‌ సిలిండర్‌ ఉన్న చుట్టు పక్కల అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆక్సిజన్‌ సిలిండర్‌ లీక్‌ అయితే.. ఇది తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆక్సిజన్‌ సిలిండర్లను రవాణా చేసే సమయంలో, నిల్వ చేసే సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి

టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??

అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్..

ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవ‌ర్‌ !!

వీళ్లు దీపావళి రాకెట్‌ను ఎలా పేల్చారో చూస్తే షాకవుతారు !!

Follow us on