మరింత బలహీనపడిన వాయుగుండం… ఆ జిల్లాల్లో హై అలర్ట్‌

Updated on: Dec 02, 2025 | 9:00 PM

దిత్వా తుఫాన్ శ్రీలంక, తమిళనాడులను అతలాకుతలం చేసి, ఆంధ్రప్రదేశ్ దిశగా కదులుతోంది. నెల్లూరుకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ బలహీనపడినా, చెన్నైలో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తీర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

శ్రీలంకను తుడిచేసి, తమిళనాడును ముంచేసి.. ఏపీ దిశగా దూసుకొస్తోంది దిత్వా తుఫాన్‌. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.ఇది క్రమేపీ బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీటీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం బలహీన పడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. మూడు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమ­వారం సాయం­త్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకువచ్చింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నా­యి. దీనికితోడు చలి కూడా ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.తుపాను కారణంగా తిరుమలలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది. బలహీన పడ్డ దిత్వా తుపాన్‌ తీవ్ర వాయు­గుండంగా మారడంతో చెన్నైలో చోట్ల భారీ వర్షం పడింది. మరింతగా భారీ వర్షాలు పడుతాయనే హెచ్చరికలతో చెన్నై, శివారు జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దిత్వా ప్రభావం.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు

120 అడుగుల ఎత్తులో గాల్లో ఇరుక్కుపోయిన టూరిస్టులు.. ఏం జరిగిందంటే

అలాంటి స్లీపర్ బస్సులు రద్దు.. NHRC స్ట్రాంగ్ వార్నింగ్

సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల

బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు