Delhi Liquor Policy Case: ఎమ్మెల్సీ కవితతో జరిపిన చాట్ ఇదేనంటూ.. సుఖేష్ సంచలనం..(Live Video)

Updated on: Apr 12, 2023 | 3:15 PM

మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ చెప్పినట్లుగానే మరో బాంబు పేల్చాడు. ఈ సారి లేఖతోపాటు తన వాట్సాప్‌ చాట్‌ను..

మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ చెప్పినట్లుగానే మరో బాంబు పేల్చాడు. ఈ సారి లేఖతోపాటు తన వాట్సాప్‌ చాట్‌ను బయటపెట్టడం సంచలనం రేపుతోంది. MLC కవితతో జరిపిన సంభాషణ అంటూ చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు సుఖేష్‌. అక్కా అంటూ తెలుగులో జరిపిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల సుఖేష్‌ చంద్రశేఖర్‌..వరుస లేఖలతో కలకలం రేపాడు. లేఖలే కాదు..తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సుఖేష్‌…MLC కవితతో చేసిన వాట్సాప్‌ చాటింగ్‌ను బయటపెట్టాడు. తెలుగు రాని సుఖేశ్‌ అక్కడక్కడా తెలుగు పదాలతో చాట్‌ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్కా అంటూ పలుమార్లు చాట్‌లో సంభోదించాడు సుఖేశ్‌. డబ్బు డెలివరీ చేశానంటూ వాట్సాప్‌ చాట్‌లో పేర్కొన్నాడు సుఖేశ్‌. స్పోకెన్‌ టూ మనీష్‌ అని రిప్లై కూడా ఇచ్చాడు. 15కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్ తెలిపాడు. ప్యాకెట్ నీకు అందజేస్తానని ఏజే చెప్పారని చాట్‌లో సుఖేష్ పేర్కొన్నాడు. కవితక్క – టీఆర్ఎస్- 98101 54102 అనే నంబర్‌తో చాట్ చేసినట్లు క్లారీటీ ఇచ్చాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో చాటింగ్ చేసినట్లు సుఖేష్ తెలిపాడు. అయితే మొత్తం 6 పేజీల లేఖను సుఖేష్ విడుదల చేయగా తాజా లేఖ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Published on: Apr 12, 2023 03:14 PM