అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు
ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘వాయునాణ్యత జీవన సూచీ (ఏక్యూఎల్‌ఐ)’లో తెలిపింది. అంతేకాదు దేశంలో 67.4 శాతం మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక బయటపెట్టింది.
ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘వాయునాణ్యత జీవన సూచీ (ఏక్యూఎల్‌ఐ)’లో తెలిపింది. అంతేకాదు దేశంలో 67.4 శాతం మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక బయటపెట్టింది. ముఖ్యంగా అతిసూక్ష్మ ధూళి కణాల కాలుష్యం కారణంగా దేశ ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందట. అత్యంత తక్కువ కాలుష్యమున్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలోనూ ప్రమాదకర కాలుష్య స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల జీవితం కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది. కాలుష్యం కారణంగా బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేసియా దేశాల్లోని ప్రజలు ఒకటి నుంచి ఆరేళ్లకుపైగా తమ జీవితకాలాన్ని కోల్పోతున్నారని తాజా నివేదిక షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అకౌంట్స్ జాగ్రత్త.. అడిగినప్పుడల్లా ఫింగర్ ప్రింటేశారో.. మీ పని అయిపోయినట్లే
TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్ చూసి ఏడ్చేసిన విజయ్
Endira ee Panchayathi: మెస్మరైజ్ చేస్తున్న ‘ఏమో ఏమో’ సాంగ్
Pawan Kalyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. OG ప్రీ వీడియో గ్లింప్స్
Salaar: బిగ్ బ్రేకింగ్.. వాయిదా పడ్డ సలార్ రిలీజ్